విజయవాడలో తనకు పోస్టింగ్ ఇస్తున్నారని ఓ  కానిస్టేబుల్...  పోలీసు జీబులో నుంచి కిందకు దూకేశాడు. ఈ వింత సంఘటన హైదరాబాద్ నగరంలోని ఖైతరాబాద్ లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ కాగా... విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పూర్తి వివరాల్లోకి వెళితే... రెండు రోజుల క్రితం ఖైరతాబాద్ కూడలిలో పోలీస్ జీపు నుంచి మధు అనే కానిస్టేబుల్ కిందకు దూకాడు. కానిస్టేబుల్ మధును బలవంతంగా జీపులోకి ఎక్కించేందుకు నలుగురు పోలీసులు ప్రయత్నించారు. తనను వదిలేయాలంటూ మధు వేడుకున్నాడు. దీంతో పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం, పెనుగులాట జరిగింది. బలవంతంగా విజయవాడకు తరలిస్తున్నారంటూ కానిస్టేబుల్ మధు ఆవేదన వ్యక్తం చేశాడు.
 
ఏపీఎస్‌పి 11వ బెటాలియన్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నానని మధు చెప్పాడు.  పోలీసుల పెనుగులాటను స్థానిక పౌరులు సెల్‌ఫోన్‌లో చిత్రీకరించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. జీపులో నుంచి దూకిన మధును పోలీసులు వెంబడించినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు పౌరుల జోక్యంతో మధును వదిలేసి పోలీసులు అక్కడి నుంచి జారుకున్నారు. కాగా.. కానిస్టేబుల్ ని అంత బలవంతంగా ఎందుకు విజయవాడకు పంపాలనుకున్నారో తెలియాల్సి ఉంది