దుబ్బాక ఉప ఎన్నికపై టీపీసీసీ క్లారిటీ ఇచ్చింది. ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఇటీవల అనారోగ్య కారణాలతో     ప్రస్తుత టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణించిన సంగతి తెలిసిందే.

దీంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. నిబంధనల ప్రకారం ఆరునెలల్లోగా ఉప ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఎన్నికలు అవసరం లేకుండా ఏకగ్రీవం కావడానికి టీఆర్ఎస్ పెద్దలు ప్రయత్నం చేస్తారని ప్రచారం జరిగింది. తాజాగా కాంగ్రెస్ తన ఉద్దేశ్యాన్ని చెప్పడంతో దుబ్బాకలో టీఆర్ఎస్ తరపున ఎవరు పోటీ చేస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది.