హైదరాబాద్: తాను ముఖ్యమంత్రి రేస్ లో లేనని కేంద్రమాజీమంత్రి సీనియర్ కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్ కు ఏ వర్గం మద్దతు ఇవ్వడం లేదని విమర్శించారు. టీఆర్ఎస్ పార్టీ టీడీపీ అధినేత చంద్రబాబును పదేపదే విమర్శించడం కాంగ్రెస్ పార్టీకే లాభమన్నారు. 

టీఆర్ఎస్ పార్టీ ఒకే అంశాన్ని పట్టుకుని వేలాడుతుంని ఎద్దేవా చేశారు. అన్ని ఎన్నికల్లో ఒకే అంశం ప్రభావితం చెయ్యదన్నారు. బోఫోర్స్ కుంభకోణం కూడా ఒకే ఎన్నికల్లో పనిచేసిందని ఆ తర్వాత పనిచెయ్యలేదన్నారు. రాఫెల్ కుంభకోణం ఈ ఎన్నికలను ప్రభావితం చేస్తుందని తెలిపారు. 

టీఆర్ఎస్ పార్టీలో అసమ్మతి చాలా ఎక్కువగా ఉందని చెప్పారు. అయితే కేసీఆర్ కు భయపడి అసమ్మతి వర్గం భయటకు రావడం లేదన్నారు. ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉందని స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఉత్తర తెలంగాణలో అత్యధిక సీట్లు సాధించిందన్నారు. 

అయితే ఉత్తర తెలంగాణలో టీఆర్ఎస్ ఎలాంటి అభివృద్ధి చేపట్టలేదని అందువల్ల అక్కడ అసంతృప్తి ఎక్కువగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం చాలా బలంగా ఉందని తెలిపారు. ఈ ఎన్నికల్లో ప్రజాకూటమి విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

టీఆరఎష్ కు ఏ వర్గం మద్దతు ఇవ్వడం లేదు, చంద్రబబును విమర్శించడం కాంగ్రెస్ కు లాభవం. ఒకే అంశం అన్ని ఎన్నికల్లో పనిచెయ్్యదు. బోఫోర్స్ అంశం కూడా ఒఖే ఎన్నికల్లో పనిచేస్ింది. ఈ ఎన్నికలను రాఫెల్ కుంభకోణం ప్రభావితం చేస్తుంది. 

కేసీఆర్ అంటే భయపడి అసమ్మతి బయటకు రావడం లేదు.  ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ బలంగా ఉంది. గత ఎన్నికల్లోటీఆర్ఎస్ తుత్తర తెలంగాణలో ఎక్కువ సీట్లు గలిచింది. అందుకే అసంతృప్తి కూడా అక్కడే అసమ్మతి ఎక్కువగా ఉంది.