జానారెడ్డి సంచలన నిర్ణయం.. ఎన్నికల బరి నుంచి తప్పుకున్న పెద్దాయన, బదులుగా రంగంలోకి కుమారుడు
టీ.కాంగ్రెస్ సీనియర్ లీడర్ జానారెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు. ఆయనకు బదులుగా జానారెడ్డి చిన్న కుమారుడు జైవీర్ రెడ్డి టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.
తెలంగాణలో ఎన్నికల సందడి నెలకొన్న సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తొలి జాబితా ప్రకటించి .. విపక్షాలను డిఫెన్స్‌లోకి నెట్టారు. దీంతో తప్పని పరిస్థితుల్లో ప్రతిపక్షాలు కూడా అభ్యర్ధుల ఎంపిక చేపట్టాయి. దీనిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఆశావహుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. సీనియర్ నేతలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు టికెట్ల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. అయితే టీ.కాంగ్రెస్ కురువృద్ధుడు, మాజీ మంత్రి జానారెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు. ఆయనకు బదులుగా జానారెడ్డి చిన్న కుమారుడు జైవీర్ రెడ్డి టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.
కాగా.. నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గం (గతంలో చలకుర్తి) నియోజకవర్గం నుండి జానారెడ్డి ఏడు దఫాలు విజయం సాధించారు. రెండు దఫాలు ఓటమి పాలయ్యాడు. 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధి నోముల నర్సింహ్మయ్య చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఆయన ఓడిపోయాడు. అయితే నర్సింహయ్య మరణంతో ఉపఎన్నికలు రావడంతో మరోసారి పోటీ చేసిన జానారెడ్డి.. నోముల భగత్ చేతిలో ఓటమి పాలయ్యారు.
ALso Read: నాగార్జునసాగర్: జానారెడ్డికి షాకిచ్చిన నోముల భగత్, బిజెపి డిపాజిట్ గల్లంతు
ఇకపోతే.. తాను కొడంతల్ నుంచే పోటీ చేయబోతున్నానని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. గురువారం నాడు ఈ మేరకు దరఖాస్తు చేయనున్నట్లు ప్రకటించారు. తన తరఫున కొడంగల్ లోని స్థానిక నేతలు దరఖాస్తు చేస్తారని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ అధిష్టానం సోనియా గాంధీ ఆదేశాల మేరకు నేను ఇక్కడ ఉండే.. కొడంగల్ లో కార్యకర్తల ద్వారా దరఖాస్తును ఇవ్వబోతున్నాం. సోనియాగాంధీ ఆదేశాల మేరకే ఇది జరుగుతోంది. కొడంగల్ అభివృద్దే లక్ష్యంగా అక్కడినుంచే పోటీకి దిగాలని ఆదేశించారని తెలిపారు. కాంగ్రెస్ లో టీపీసీసీ చీఫ్ అయినా.. సామాన్య కార్యకర్త అయినా సరే పోటీ చేయాలంటే దరఖాస్తు చేసుకోవాల్సిందే. ఈ క్రమంలోనే తాను ఈ రోజు దరఖాస్తు చేయబోతున్నట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు.