హైదరాబాద్: గ్రేటర్ హైద్రాబాద్ పరిధిలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో వీవీప్యాట్‌లలోని స్లిప్పులు బయటకు వచ్చాయి. జీహెఛ్ఎంసీ గోషా మహల్ సర్కిల్-5 ఎదుట బుధవారం నాడు కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు.

వీవీ ప్యాట్స్ కు సీల్ ఎందుకు వేయలేదని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.ఈ విషయమై సీబీఐ విచారణ చేయాలని  కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.
జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో వీవీప్యాట్స్ కు సీల్ లేవు. 45 రోజుల వరకు సీల్ ఉండాలి. ఎవరైనా కేసు వేస్తే వీవీప్యాట్స్ సీల్ వేయకపోవడంపై కాంగ్రెస్ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రిటర్నింగ్ అధికారి ఉద్దేశ్యపూర్వకంగా ఇలా చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.

ఈ విషయమై న్యాయ పోరాటం చేస్తామని కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు. నిబంధనలపై అవగాహన లేకనే జూబ్లీహిల్స్ రిటర్నింగ్ అధికారి వీవీప్యాట్స్ ‌ను మరోబాక్స్ లో భద్రపర్చారని జీహెచ్ఎంసీ కమిషనర్  దానకిషోర్ చెప్పారు.

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో వీవీప్యాట్స్ స్లిప్పులను మరో బాక్స్ లో భద్రపర్చారని చెప్పారు.ఈ విషయమై జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి రిటర్నింగ్ అధికారిగా ఉన్న  సికింద్రాబాద్ ఆర్డీఓపై చర్యలు తీసుకొంటామని దానకిషోర్ ఆరోపించారు.