Asianet News TeluguAsianet News Telugu

రోజూ వెయ్యిమంది కరోనా బాధితులకు ఉచిత భోజనం.. ప్రారంభించిన రేవంత్ రెడ్డి

సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి వద్ద కరోనా రోగులకు ప్రతిరోజు వెయ్యి మందికి ఉచిత భోజన కార్యక్రమాన్ని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంపీ రేవంత్ రెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సోనియా గాంధీ,  రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. 

congress mp revanth reddy started free meals for corona patients at gandhi hospital - bsb
Author
Hyderabad, First Published May 15, 2021, 3:21 PM IST

సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి వద్ద కరోనా రోగులకు ప్రతిరోజు వెయ్యి మందికి ఉచిత భోజన కార్యక్రమాన్ని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంపీ రేవంత్ రెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సోనియా గాంధీ,  రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. 

లాక్ డౌన్ కారణంగా పేషెంట్ల కుటుంబ సభ్యులకు భోజనాలు దొరకడం లేదన్నారు. ఫస్ట్ వేవ్‌లో కూడా ప్రభుత్వాలు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయలేదని విమర్శించారు. యూత్ కాంగ్రెస్ తరపున అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. యూత్ కాంగ్రెస్ వర్క్ చేస్తుంటే అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు. 

విచారణ పేరిట అడ్డుకుంటున్నారన్నారు. గాంధీ ఆసుపత్రి కోవిడ్ హాస్పిటల్ అయినా.. కనీస సౌకర్యాలు లేవని.. ఎవరి దగ్గర డబ్బులు లేవని తెలిపారు. డాక్టర్లు, నర్సులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఆహారం ఏర్పాటు చేయలేదని విమర్శించారు.  ప్రతి రోజూ 1000 మందికి ఆహారం ఏర్పాటు చేస్తున్నామన్నారు. 

లాక్‌డౌన్ ఉన్నంతవరకు భోజన వసతి కల్పిస్తామని చెప్పారు. ఐదు రూపాయలకే భోజనం కార్యక్రమాన్ని కాంగ్రెస్ స్టార్ట్ చేసిందని... అయితే ఈ టైంలో కూడా ప్రభుత్వం భోజనం ఏర్పాటు చేయలేదని ఎంపీ అన్నారు. డాక్టర్లు నర్సులు సిబ్బంది పేషెంట్లు వారి బంధువులకు వెయ్యిమందికి భోజనం ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.

ఈరోజు రేపు వ్యాక్సిన్లను నిలిపివేశారని.. సెకండ్ డోస్ అందించడానికి వ్యాక్సిన్స్ లేదని అన్నారు. వ్యాక్సిన్ లేక ఇలా డోసుల వ్యవధి పెంచుతున్నారని వ్యాఖ్యానించారు. టిమ్స్ లో 8వ ఫ్లోర్ తరువాత ఆక్సిజన్ అందడం లేదని తెలిపారు. బెడ్స్ కొరత, ఆక్సిజన్, రెమెడిషివర్ కొరత తీవ్రంగా ఉందని చెప్పారు.

సిగ్గులేకుండా వసూళ్ల కోసం ప్రగతిభవన్లో టాస్క్ఫోర్స్ కమిటీ సమావేశం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరమైన సమస్యలను చర్చించలేదు అన్నారు. ఒక గర్భిణీ వైద్యం అందక చనిపోయిందని స్మశాన సిబ్బంది కూడా తల్లినీ బిడ్డను వేరు చేస్తేనే దహనం చేస్తామని అన్నారని ఆయన తెలిపారు. 

ప్రభుత్వ హాస్పిటల్స్ లో కనీస సౌకర్యాలు లేవని దుయ్యబట్టారు. టాస్క్‌ఫోర్స్‌లో వసూల్ టీం  మాత్రమే ఉందని ఆరోపించారు. వైద్యులు ఎవరూ లేరన్నారు. కార్పొరేట్ కంపెనీలని పిలిచి... దండుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అందరికీ వ్యాక్సిన్లు అందాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకుల మీద వేధింపులు ఆపాలన్నారు.

రెమిడీసివర్ బ్లాక్ మార్కెట్ అయిందన్నారు. టిఆర్ఎస్ నాయకులు, కంపెనీల దగ్గర స్టాక్ పెట్టుకుంటున్నారని కావలసిన వారికి రెమిడీసివర్ ఇచ్చుకుంటున్నారని ఆరోపించారు. కరోనాను ఆరోగ్యశ్రీలో ఎందుకు చేర్చడం లేదని ప్రశ్నించారు.

కరోనాతో తల్లిదండ్రులు చనిపోతే చత్తీస్ ఘడ్ లో పిల్లలకి రూ.5000 ఇస్తున్నారని ఇక్కడ కూడా అలాగే ఇవ్వాలని డిమాండ్ చేశారు. యశోద  హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్స్ ఇష్టారాజ్యంగా కోట్ల బిల్లులు వేస్తున్నారని, 
మెడిసిన్ వాడకుండా బిల్స్ వేస్తున్నారని ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు.

Follow Us:
Download App:
  • android
  • ios