హైదరాబాద్: ఉద్యోగ నియామకాలపై ఎవరు చర్చకు వచ్చినా తాను సిద్దమేనని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి చెప్పారు.సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికలు వచ్చినందునే అధికార పార్టీ ఉద్యోగాల గురించి మాట్లాడుతోందన్నారు. 

రాష్ట్ర ప్రభుత్వం లక్షలాది ఉద్యోగాలు ఇచ్చినట్టుగా ప్రకటనలు చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఉద్యోగాలు ఇస్తే  చర్చకు రావడానికి ఎందుకు ఇబ్బంది అని ఆయన ప్రశ్నించారు.ఉద్యోగాలపై కేటీఆర్  చర్చకు రాకుండా విద్యావేత్తను తిట్టించారన్నారు. టీఆర్ఎస్ అభ్యర్ధులను గెలిపిస్తే ఓయూను కూడా కబ్జా చేస్తారని ఆయన విమర్శించారు.

తమ ప్రభుత్వం 1.32 లక్షల ఉద్యోగాలను ఇచ్చిందని కేటీఆర్ ఇటీవల చేసిన ప్రకటనపై కాంగ్రెస్ సవాల్ విసిరింది. కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ కుమార్ గన్ పార్క్ వద్ద చర్చకు రావాలని టీఆర్ఎస్ కు సవాల్ విసిరారు. కేటీఆర్ తో పాటు ఆ పార్టీ నేతలు ఎవరొచ్చినా కూడ చర్చకు తాను సిద్దమేనని ఆయన చెప్పారు.గన్ పార్క్ వద్ద రెండు గంటల పాటు  టీఆర్ఎస్ నేతల కోసం ఎదురు చూసినా కాంగ్రెస్ నేతలు వెనుదిరిగి వెళ్లిపోయిన విషయం తెలిసిందే.