ఢిల్లీ:  కాంగ్రెస్ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. న్యూ ఢిల్లీలో గడ్కరీతో ప్రత్యేకంగా భేటీ అయిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణపై చర్చించారు. 

రాష్ట్రంలో రోడ్లన్నీ నాశనం అయ్యాయని, జాతీయ రహదారులుగా గుర్తిస్తారని, రాష్ట్ర ప్రభుత్వం గుంతలు కూడా పూడ్చడం లేదని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దుయ్యబట్టారు. హైదరాబాద్- విజయవాడ 8 లైన్ల రహదారిలో భాగంగా ఎల్బీనగర్‌ నుంచి కుత్బుల్లాపూర్‌ వరకు వదిలేశారని ఆరోపించారు. వాటిని జాతీయ రహదారులుగా గుర్తించి బాగుచేయాలని కోరారు. జాతీయ రహదారుల విషయంలో టీఆర్ఎస్ పార్టీ అసత్య ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. 

మరోవైపు కాగజ్ నగర్ లో ఎఫ్ఆర్ వో సునీతపై దాడి ఘటనపై స్పందించారు. అటవీ అధికారులకు లైసెన్స్డ్‌ ఆయుధాలు ఇవ్వాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వ అధికారులకు రక్షణ కల్పించాలని, సచివాలయానికి రాని సీఎంకు కొత్త సచివాలయ భవనం ఎందుకని ప్రశ్నించారు. ప్రజాధనం దుర్వినియోగంపై కోర్టును ఆశ్రయిస్తామని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హెచచరించారు..