హైదరాబాద్:ఆర్టీసీ జేఎసీ నేతలు కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్కను ఆదివారం నాడు కలిశారు. తమ కార్యక్రమాలకు మద్దతివ్వాలని  ఆర్టీసీ జేఎసీ నేతలు భట్టి విక్రమార్కను కోరారు.

ఆర్టీసీ జేఎసీ నేతలకు కాంగ్రెస్ ఎమ్మెల్యే  మల్లు భట్టి విక్రమార్క మద్దతు ప్రకటించారు. ఆర్టీసీ జేఎసీ వరుసగా కార్యక్రమాలను ప్రకటించారు. సోమవారంనాడు ఆర్టీసీ జేఎసీ నేతలు  ఇందిరా పార్క్ వద్ద  నిరహారదీక్ష చేయనున్నారు.

ఆదివారం నాడు  జేఎసీ నేతలు టీజేసీ చీఫ్ కోదండరామ్ ను కలిశారు. కోదండరామ్  కూడ ఆర్టీసీ జేఎసీ నేతలకు మద్దతు ప్రకటించారు. మల్లు భట్టి విక్రమార్క కూడ ఆర్టీసీ నేతలకు మద్దతు ప్రకటించారు.

ఆర్టీసీ సమ్మెను విరమించేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. ఆర్టీసీని రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన  కోరారు.