Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ ను జైల్లో ఎప్పుడు పెడతారో..? ఎలా పెడతారో? చెప్పాలి.. జగ్గారెడ్డి

సీఎం కేసీఆర్‌ను బండి సంజయ్‌ జైల్లో పెడతానని అంటాడే గానీ.. కేసీఆర్‌ చేసిన తప్పేంటో చెప్పడని అన్నారు. ఏం ఆధారం ఉందని జైల్లో పెడతారని.. టీఆర్‌ఎస్‌ వాళ్లూ అడగరని పేర్కొన్నారు. ఎన్నికల సందర్భంగా కేసీఆర్‌ ఇచ్చిన హామీల అమలుపైనా బండి సంజయ్‌ మాట్లాడట్లేదని, వాటి అమలు కోసం పోరాటమూ చేయడం లేదని గుర్తు చేశారు. అలాగే, ప్రతి పేదవాడి బ్యాంక్‌ ఖాతాలో రూ.15 లక్షల చొప్పున వేస్తామన్న మోదీ హామీ గురించి టీఆర్‌ఎస్‌ నేతలు మాట్లాడడం లేదని తెలిపారు. ఒకరి హామీలను ఒకరు అడగకూడదన్నదే ఆ రెండు పార్టీల మధ్య ఉన్న ఒప్పందమని ఆరోపించారు.

congress mla jaggareddy question to bjp leader bandi sanjay over kcr - bsb
Author
Hyderabad, First Published Jan 22, 2021, 10:58 AM IST

సీఎం కేసీఆర్‌ను బండి సంజయ్‌ జైల్లో పెడతానని అంటాడే గానీ.. కేసీఆర్‌ చేసిన తప్పేంటో చెప్పడని అన్నారు. ఏం ఆధారం ఉందని జైల్లో పెడతారని.. టీఆర్‌ఎస్‌ వాళ్లూ అడగరని పేర్కొన్నారు. ఎన్నికల సందర్భంగా కేసీఆర్‌ ఇచ్చిన హామీల అమలుపైనా బండి సంజయ్‌ మాట్లాడట్లేదని, వాటి అమలు కోసం పోరాటమూ చేయడం లేదని గుర్తు చేశారు. అలాగే, ప్రతి పేదవాడి బ్యాంక్‌ ఖాతాలో రూ.15 లక్షల చొప్పున వేస్తామన్న మోదీ హామీ గురించి టీఆర్‌ఎస్‌ నేతలు మాట్లాడడం లేదని తెలిపారు. ఒకరి హామీలను ఒకరు అడగకూడదన్నదే ఆ రెండు పార్టీల మధ్య ఉన్న ఒప్పందమని ఆరోపించారు.

అంతేకాదు ‘‘బీజేపీ, టీఆర్‌ఎస్‌, ఎంఐఎం పార్టీలది పాలోళ్ల పంచాయితీ. సాధారణంగా అన్నదమ్ముల పిల్లలు పగలంతా కొట్టుకుంటూ ఊరంతా పరేషాన్‌ చేస్తరు. రాత్రి కాగానే అందరూ కల్లు దుకాణం దగ్గర కూర్చుని మాట్లాడుకుంటరు. ఈ మూడు రాజకీయ పార్టీలది కూడా ఇలాంటి పంచాయితీనే’’ అని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. 

టీఆర్‌ఎస్‌, బీజేపీ, ఎంఐఎం పార్టీలు పగలు కొట్టుకుంటూ రాత్రి మాట్లాడుకుంటాయని, దేశం, రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి రానివ్వకూడదన్నదే ఈ మూడు పార్టీల వ్యూహమన్నారు. గాంధీభవన్‌లో గురువారం జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ అధికారంలో ఉన్నా, లేకున్నా ప్రజల కోసం పని చేసేది కాంగ్రెస్‌ మాత్రమేనని స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌ ఇచ్చిన హామీలు రాసేందుకు డైరీ పెడితే అది నిండి పోతుందని, కానీ అమలు చేసిన వాటికి టిక్కు కొట్టాలంటే ఒక్కటీ కనిపించదని ఎద్దేవా చేశారు. 

ఇక బీజేపీ... గుళ్లో దేవుళ్లను రోడ్లపైకి తీసుకువచ్చి రాజకీయం చేస్తోందని దుయ్యబట్టారు. కేసీఆర్‌ను జైల్లో పెడతానంటూ ఇప్పటికి వందసార్లు చెప్పారని, ఆయనవి మాటలేనా.. చేతలు ఏమైనా ఉన్నాయా? అని ప్రశ్నించారు. మాటలు వినీ.. వినీ బోర్‌ అవుతోందని, ఈ డ్రామాను బంద్‌ చేసి కేసీఆర్‌ను ఎప్పుడు జైల్లో పెడతారో స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ‘‘మేమూ గుళ్లకు పోతాము. బండి సంజయ్‌.. ఏనాడైనా పాడుపడిన గుడిని సందర్శించి దీపం వెలిగించారా? జీహెచ్‌ఎంసీ ఎన్నికలు అనగానే సంజయ్‌కు భాగ్యలక్ష్మి దేవాలయం గుర్తుకు వచ్చింది. సాధారణ ఎన్నికల సమయానికి ఆయన ఏ దేవుడిని రోడ్లపైకి తీసుకువస్తడో’’ అని వ్యాఖ్యానించారు.

 తెలంగాణ పేరుతో టీఆర్‌ఎస్‌, దేవుళ్ల పేరుతో బీజేపీ, ముస్లింలను రెచ్చగొడుతూ ఎంఐఎం.. రాజకీయం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. కాంగ్రె్‌సకు అన్ని గ్రామాలు, పట్టణాల్లో ఓటు బ్యాంకు ఉందని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాంగ్రె్‌సకు రాకుండా ఈ మూడు పార్టీలూ ఒప్పందానికి వచ్చి నాటకం ఆడుతున్నాయని ఆరోపించారు. 

ప్రజాసమస్యలు ఎల్లకాలం ఇలానే ఉండాలని, దానిపైన రాజకీయం చేస్తూ బతకాలని ఈ మూడు పార్టీలూ అనుకుంటున్నాయన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారం కోసం పాకులాడే పార్టీ కాదని, ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులకు అండగా నిలబడ్డది సోనియా, రాహులేనని అన్నారు. ఢిల్లీలో మూడు రోజులు పర్యటించిన సీఎం కేసీఆర్‌.. ధర్నా చేస్తున్న రైతుల్ని ఎందుకు కలవలేదని ప్రశ్నించారు. గుంటనక్కల్లాంటి ఈ మూడు పార్టీల రాజకీయాలను గమనించి జాగ్రత్తగా ఉండాలని ప్రజలను కోరారు.

‘‘ప్రాంతీయ పార్టీల్లో తండ్రి తర్వాత కొడుకునే సీఎంను చేసే సంప్రదాయం ఉంది. ఎవరైనా కొడుకును కాదని అల్లుడిని సీఎం చేస్తారా?’’ అని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. సీఎం మార్పు అన్నది టీఆర్‌ఎస్‌ ఇంటి పంచాయితీ అని, కేసీఆర్‌.. ఎవరిని సీఎం చేస్తడన్నది ఆయన ఇష్టమన్నారు. కాంగ్రెస్ లో మాత్రం అలా ఉండబోదన్నారు. రాష్ట్రంలో సీఎం మార్పు అన్నది అమిత్‌షా డైరెక్షన్‌లోనే జరుగుతుందన్న అనుమానాన్ని జగ్గారెడ్డి వ్యక్తం చేశారు. 

రాష్ట్రంలో రాజకీయం ఎటు తిరిగినా దాని వెనుక బీజేపీ, టీఆర్‌ఎస్‌, ఎంఐఎం వ్యూహం ఉంటుందన్నారు. కేటీఆర్‌ను సీఎం చేయడంవల్ల బీజేపీకి చాలా ఉపయోగం ఉంటుందని, అప్పుడు కొత్త ఆటను ప్రారంభిస్తుందన్నారు. రాజకీయంగా కొత్త కోణంలో ప్రజల్ని మోసం చేసి వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడమే వారి అజెండా అని పేర్కొన్నారు. 

మంత్రి కేటీఆర్‌తో తనకు ఇంతవరకు పంచాయితీ లేదని, దోస్తానా కూడా లేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. జిల్లా రాజకీయాల్లో తనకు, హరీశ్‌రావుకు నడుస్తుందన్నారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేకే ఎన్నికలప్పుడు జైల్లో పెట్టించాడని దుయ్యబట్టారు. ఆయనకు తాను ఒక్కడినే సరిపోతానని, రానున్న జడ్పీ సమావేశాల్లో ఎన్నికల హామీలపై ఆయన్ను నిలదీస్తానన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios