వారిద్దరు ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు. తమ అనుచరులు, కింది స్థాయి నాయకులు, పార్టీ కార్యకర్తలకు ఆదర్శంగా వుండాల్సిన వారే వీధి రౌడిల్లా వ్యవహరించారు. అదికూడా ఇతర పార్టీలతో కలిసి ప్రజా సమస్యలపై పోరాడుతున్న సభలో  కావడం మరీ దారుణం. ఇలా సీనియర్ల కొట్లాటతో ప్రజా సమస్యల పరిష్కారం మాట అటుంచి కాంగ్రెస్ పార్టీకే ఓ కొత్త సమస్య  వచ్చి పడింది. 

కాంగ్రెస్ నాయకుల గొడవకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. తెలంగాణ ఇటీవల వెలువడిన ఇంటర్మీడీయట్ ఫలితాల్లో అనేక అవకతవకలు చోటుచేసుకున్నట్లు విద్యార్థులు అనుమానం వ్యక్తం చేశారు. ఇలా పరీక్షలో ఫెయిలై మనస్తాపానికి గురై దాదాపు 28 విద్యార్థులు ప్రాణాలు వదిలారు. అయినప్పటికి  ఇంటర్మీడియట్ బోర్డు కానీ, ప్రభుత్వం కానా విద్యార్థులను అనుమానాలను  నివృత్తి చేయకపోవడంతో పాటు ఆత్మహత్యలను ఆపడానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ప్రతిపక్షాలు సీన్ లోకి ఎంటరయ్యాయి. 

వారు తమ నిరసనల ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి  తెచ్చే ప్రయత్నం  చేశారు. ఈ క్రమంలోనే శనివారం  తెలంగాణలోని అఖిలపక్ష పార్టీలన్ని కలిసి బాధిత విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి ధర్నా చేపట్టారు. ఇందులో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి కుంతియా ముఖ్య హాజరవనుండగా అతడి కోసం వేదికపై ఓ కుర్చీని ఏర్పాటుచేశారు. ఈ కుర్చీ  కోసమే కాంగ్రెస్ నాయకుల మధ్య గొడవ  చోటుచేసుకుంది.

కుంతియా కోసం ఏర్పాటుచేసిన కుర్చీపై  కాంగ్రెస్ పార్టీకే చెందిన నాయకులు గజ్జెల నగేశ్‌ అనుకోకుండా కూర్చున్నారు. దీంతో అక్కడే వున్న హన్మంత రావు అతన్ని ఆ కుర్చీలోంచి లేవాల్సిందిగా ఆదేశించాడు. దీంతో నగేష్ అనుచరులకు, వీహెచ్ కు మధ్య మాటామాటా పెరిగింది.  ఆవేశంతో ఊగిపోయిన వీహెచ్ తనతో వాగ్వాదానికి దిగిన నగేష్ అనుచరుల్లో ఒకరిపై చేయి చేసుకున్నాడు. దీంతో నగేష్ కూడా కోపంతో వీహెచ్ వేదికపై నుండి తోసేశాడు. దీంతో ధర్నాస్థలం  వద్ద గందరగోళం  ఏర్పడింది.  

వీడియో