Asianet News TeluguAsianet News Telugu

రేవంతే సీఎం .. డీకే శివకుమార్ సమక్షంలో కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యలు , సీనియర్లు ఒప్పుకుంటారా ..?

రేవంత్ రెడ్డే సీఎం అని ఏకంగా కేపీసీసీ చీఫ్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సమక్షంలోనే కొందరు కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించారు . రేవంత్ రెడ్డి సీఎం కాగానే ఆరు గ్యారెంటీలపై తొలి సంతకం చేస్తారంటూ చెప్పుకొచ్చారు. 

congress leaders said that revanth reddy is cm infront of karnataka dy cm dk shiva kumar ksp
Author
First Published Oct 28, 2023, 10:13 PM IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అయ్యేది ఎవరు అనే చర్చ మొదలైంది. సాధారణంగా కాంగ్రెస్‌లో ఓ స్థాయి నేతలంతా తామే కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పుకుంటూ వుంటారు. ఇది ఇప్పటిది కాదు.. నెహ్రూ, ఇందిర జమానా నుంచి అదే తంతు. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్‌లో వున్న జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి ఇలా సీనియర్లంతా సీఎం రేసులో వున్నవారే.

ఇక టీడీపీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి పేరు ఈసారి సీఎం రేసులో ఎక్కువగా వినిపిస్తోంది. ఆయన పీసీసీ చీఫ్‌గా పగ్గాలు చేపట్టిన తర్వాత పార్టీ శ్రేణుల్లో జోష్ పెరిగింది. తన వాగ్ధాటి , విషయ పరిజ్ఞానంతో రేవంత్ రెడ్డి అధికార పార్టీని చెడుగుడు ఆడుకుంటారు. దీంతో ఆయనే కాబోయే సీఎం అంటూ పార్టీ కార్యకర్తలు , అభిమానులు నినాదాలు చేస్తూ వుంటారు. 

ALso Read: కర్ణాటక రండి , గ్యారెంటీలు అమలవుతున్నాయో లేదో చూపిస్తాం : కేసీఆర్, కేటీఆర్‌లకు డీకే శివకుమార్ సవాల్

కానీ హైకమాండ్ లెక్కలు వేరే వుంటాయన్న సంగతి తెలిసిందే. అయితే రేవంత్ రెడ్డే సీఎం అని ఏకంగా కేపీసీసీ చీఫ్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సమక్షంలోనే కొందరు కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా శనివారం తాండూర్, పరిగిలలో జరిగిన బస్సు యాత్రలో డీకే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతుండగా.. రేవంత్‌ని సీఎం.. సీఎం అంటూ అభిమానులు నినాదాలు చేశారు. అయితే కొందరు కాంగ్రెస్ నేతలు మరో అడుగు ముందుకేసి.. రేవంత్ రెడ్డి సీఎం కాగానే ఆరు గ్యారెంటీలపై తొలి సంతకం చేస్తారంటూ చెప్పుకొచ్చారు. 

ప్రస్తుతం దీనికి సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిన్న గాక మొన్న వచ్చిన రేవంత్ సీఎం అవుతానంటే.. ఎప్పటి నుంచో కాంగ్రెస్‌లో వున్న సీనియర్లు ఒప్పుకుంటారా. అసలు టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ నియామకంపైనే బహిరంగంగా విమర్శలు చేశారు. కోమటిరెడ్డి వంటి వాళ్లయితే తాను జన్మలో గాంధీ భవన్ గుమ్మం తొక్కానని వ్యాఖ్యానించారు. ఆయన తమ్ముడు రాజగోపాల్ రెడ్డి ఏకంగా కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. ఆ సమయంలో రాజగోపాల్ రెడ్డి.. రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు అన్నీ ఇన్నీ కావు. 

Follow Us:
Download App:
  • android
  • ios