హైదరాబాద్: తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ మార్చి 8 నుండి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆమరణ నిరహారదీక్ష చేసేందుకు తనతో కలిసి సిద్దమా అని కేటీఆర్ కు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.

శుక్రవారం నాడు మహబూబ్ నగర్ , రంగారెడ్డి, హైద్రాబాద్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా  రేవంత్ రెడ్డి  టీఆర్ఎస్ కి సవాల్ విసిరారు.నమో అంటే నమ్మించి మోసం చేయడమేనని ఆయన విమర్శించారు. 

మోడీ మోసం చేశాడని ఇవాళ కేటీఆర్ చెబుతున్నారు. ఈ మోసంపై పార్లమెంట్ లో బీజేపీని నిలదీస్తామని  కేటీఆర్ చెప్పడాన్ని ఆయన తప్పుబట్టారు.

జీఎస్టీ నుండి నల్ల చట్టాల వరకు బీజేపీ చేసిన అన్ని చట్టాలకు టీఆర్ఎస్ మద్దతు పలికిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ డిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఆమరణ నిరహారదీక్షకు కూర్చొందాం రావాలని రేవంత్ రెడ్డి కేటీఆర్ కు సవాల్ విసిరారు.కేటీఆర్ కు మోడీ మీద కొట్లాడే దమ్ముందా అని ఆయన ప్రశ్నించారు.