Rahul Gandhi : ఓయూలో సమావేశం లేకుండానే.. రాహుల్ తెలంగాణ పర్యటన.. మినెట్ టూ మినెట్ షెడ్యూల్ ఇదే..

Rahul Gandhi Telangana Tour Schedule: కాంగ్రెస్‌ పార్టీ అగ్ర నేత రాహుల్‌ గాంధీ రెండ్రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్న నేపథ్యంలో ఆయన షెడ్యూల్‌‌ను పార్టీ వర్గాలు ఖరారు చేశాయి. అయితే.. ఈ షెడ్యూల్ లో ఓయూలో స‌మావేశం లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

Congress Leader Rahul Gandhi Telangana Tour Schedule On May 6 And 7

Rahul Gandhi Telangana Tour Schedule:  తెలంగాణలో రెండు రోజుల పాటు కాంగ్రెస్‌ పార్టీ అగ్ర నేత  రాహుల్ గాంధీ పర్య‌టించ‌నున్నారు. ఈ మేర‌కు మినెట్ టూ మినెట్ షెడ్యూల్ ఖరారయింది.

ఈ షెడ్యూల్ ప్రకారం.. 6వ తేదీ షెడ్యూల్

రాహుల్ గాంధీ శుక్ర‌వారం సాయంత్రం 4:50కి ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో  శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు.  అనంత‌రం సాయంత్రం  5:10కి శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ప్ర‌త్యేక హెలికాప్టర్ ద్వారా వరంగల్ బయలుదేరుతారు. 5:45 గంట‌ల వ‌ర‌కు వరంగల్ గాబ్రియెల్ స్కూల్ కు చేరుకుంటారు. త‌దుప‌రి సాయంత్రం 6:05 గంట‌ల‌కు వరంగల్ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన రైతు సంఘర్షణ సభలో పాల్గొంటారు. ఈ కార్యక్ర‌మం అనంత‌రం రాత్రి 8:00 గంటలకు వరంగల్ నుండి బై రోడ్ ద్వారా బయలుదేరి రాత్రి  10:40 గంట‌ల వ‌ర‌కు హైదరాబాద్ చేరుకుంటారు. రాత్రి బంజారాహిల్స్ తాజ్ కృష్ణ హోటల్ లో స్టే చేస్తారు..

7వ తేదీ షెడ్యూల్

శనివారం.. మధ్యాహ్నం 12:30కి హోటల్ తాజ్ కృష్ణ నుంచి బయలుదేరి 12:50కి  సంజీవయ్య పార్కు కు చేరుకుంటారు. 12:50 నుంచి  1:10మధ్య దివంగత మాజీ సీఎం సంజీవయ్య కు నివాళులు అర్పిస్తారు..
అనంత‌రం మ‌ధ్యాహ్నం 1:15 కు సంజీవయ్య పార్కు నుంచి బయలుదేరి 1:30కి గాంధీ భవన్ చేరుకుంటారు. 1:45నుంచి 2:45వరకు గాంధీ భవన్ లో పార్టీ extended మీటింగ్ లో పాల్గొంటారు. 2:45 నుంచి 2:50వరకు మెంబర్ షిప్ కో ఆర్డినేతలతో ఫోటోలు దిగుతారు. ఈ  కార్య‌క్ర‌మం అనంత‌రం 3 గంటలకు గాంధీ భవన్ నుంచి బైరోడ్ ద్వారా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. సాయంత్రం 5:50 కి శంషాబాద్  ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీ వెళ్తారు. 

అయితే.. ఈ షెడ్యూల్ లో ప్రధానంగా..  ఓయూలో సమావేశం, ఎన్‌ఎస్‌యూఐ నేతల్ని రాహుల్ గాంధీ పరామర్శించ‌డం లేకుండానే షెడ్యూల్ త‌యారు చేశారు. రాహుల్ గాంధీ పర్య‌ట‌న ఖ‌రారు అయినా నాటి నుంచి  కాంగ్రెస్ నేతలు అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా ... ఓయూలో సమావేశం పెడతామని చెప్పుకోచ్చారు. అలాగే...  అరెస్టయిన ఎన్‌ఎస్‌యూఐ నేతల్ని రాహుల్ గాంధీ పరామర్శిస్తారని భారీ ఎత్తున ప్ర‌చారం చేసుకొచ్చారు. అయితే ఈ రెండు కార్యక్రమాలూ షెడ్యూల్‌లో కనిపించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. 

ఇదిలా ఉంటే.. రాహుల్ గాంధీ పర్యటనను ఎలాగైనా విజ‌య‌వంతం చేయాల‌ని కాంగ్రెస్ నేతలు భారీ ప్రయత్నాలు చేస్తున్నారు. వరంగల్ సభకు భారీగా జన సమీకరణ కోసం ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకంగా కమిటీలు నియమించారు. మరోవైపు హైదరాబాద్ పర్యటనలోనూ షెడ్యూల్‌లో లేకపోయినా కీలకమైన కార్యక్రమం చేపట్టే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.  రాహుల్ గాంధీ పర్యటన నేప‌థ్యంలో  కాంగ్రెస్ నేత‌లంతా త‌మ మ‌ధ్య నున్న విభేదాలు మ‌రిచి.. రాహుల్ టూర్ ను  విజయవంతం చేసేందుకు తీవ్రంగా శ్ర‌మిస్తున్నారు.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios