హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో సీఎల్పీని టీఆర్ఎస్‌ఎల్పీలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ  36 గంటల పాటు నిరహారదీక్షను మాజీ సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క శనివారం నాడు ప్రారంభించారు.

గత ఏడాది డిసెంబర్ 7వ తేదీన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ తరపున 19 మంది ఎమ్మెల్యేలు విజయం సాధించారు.  కాంగ్రెస్ పార్టీకి చెందిన12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌కు మద్దతుగా నిలిచారు.  రెండు రోజుల క్రితం సీఎల్పీని టీఆర్ఎస్‌ఎల్పీలో విలీనం చేస్తూ స్పీకర్‌కు లేఖ ఇచ్చారు.  ఈ 12 మంది లేఖ ఆధారంగా సీఎల్పీని టీఆర్ఎస్‌ఎల్పీలో విలీనం చేశారు.

ఈ ప్రక్రియను నిరసిస్తూ మాజీ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క శనివారం నాడు ఇందిరాపార్క్ వద్ద  36 గంటల దీక్షకు దిగారు. ఈ దీక్షకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంచార్జీ కుంతియా, ఆ పార్టీ నేతలు, టీటీడీపీ నేతలు రావుల చంద్రశేఖర్ రెడ్డి, టీజేసీ చీఫ్  కోదండరామ్ మద్దతు పలికారు.