మునుగోడు: మునుగోడు నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఆసక్తిగా గమనిస్తున్న ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో కుటుంబ సభ్యులు, అభిమానులు ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. ఐదో రౌండ్ ముగిసేసరికి కోమటిరెడ్డి 2880 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డికి ప్రత్యర్థిగా టీఆర్ఎస్ నుంచి కె.ప్రభాకర్‌రెడ్డి, బీజేపీ నుంచి జీ.మనోహర్‌రెడ్డి బరిలో ఉన్నారు.