Asianet News TeluguAsianet News Telugu

ఎనిమిది దఫాలు గెలుపు: జానాను ఓడించిన నోముల

ముఖ్యమంత్రి పదవి తప్ప కీలకమైన  పదవులను నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి ప్రజా కూటమి  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే  సీఎంగా కూడ ప్రచారమైంది. 

congress leader jana reddy defeated in nagarjuna sagar segment
Author
Nagarjuna Sagar Dam, First Published Dec 11, 2018, 1:03 PM IST


నల్గొండ: ముఖ్యమంత్రి పదవి తప్ప కీలకమైన  పదవులను నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి ప్రజా కూటమి  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే  సీఎంగా కూడ ప్రచారమైంది. అయితే  ఈ దఫా నాగార్జున సాగర్ ‌నుండి  టీఆర్ఎస్ అభ్యర్థి నోముల నర్సింహ్మయ్య చేతిలో  జానారెడ్డి ఓటమి పాలయ్యారు.

అసెంబ్లీ ఎన్నికల్లో  జానారెడ్డి ఓడిపోవడం ఇది రెండోసారి. 1994 ఎన్నికల సమయంలో చలకుర్తి అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసిన జానారెడ్డి టీడీపీ అభ్యర్ధి రామ్మూర్తి యాదవ్ చేతిలో ఓటమి పాలయ్యారు.

చలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా  అభివృద్ధి చేసినందున ప్రచారం చేయకుండానే తాను ఎన్నికల్లో పోటీ చేస్తానని జానారెడ్డి 1994లో ప్రకటించారు. ఆ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించలేదు.  దీంతో ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి రామ్మూర్తి యాదవ్  జానారెడ్డిపై విజయం సాధించారు.

2009 ఎన్నికల సమయంలో నియోజకవర్గాల పునర్విభజన సమయంలో చలకుర్తి  రద్దైంది. దీంతో నాగార్జునసాగర్‌ నుండి  జానారెడ్డి పోటీ చేశారు. నాగార్జునసాగర్ నుండి జానారెడ్డి 2009, 2014 ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ రెండు ఎన్నికల్లో విజయం సాధించారు.

గత ఎన్నికల్లో సీపీఎంకు రాజీనామా చేసిన నోముల నర్సింహ్మయ్య చివరి నిమిషంలో నాగార్జునసాగర్ నుండి  పోటీ చేసి ఓటమి పాలయ్యారు.ఈ ఎన్నికల్లో  జానారెడ్డిపై మరోసారి నర్సింహ్మయ్య పోటీ చేసి విజయం సాధించారు.

Follow Us:
Download App:
  • android
  • ios