తాము పార్టీని వీడటానికి అనేక కారణాలున్నాయన్నారు టీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ..పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు నోటీసుల నేపథ్యంలో ఎమ్మెల్యేలు మీడియా ముందుకు వచ్చారు.
తాము పార్టీని వీడటానికి అనేక కారణాలున్నాయన్నారు టీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ..పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు నోటీసుల నేపథ్యంలో ఎమ్మెల్యేలు మీడియా ముందుకు వచ్చారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేగా కాంతారావు మాట్లాడుతూ... కాంగ్రెస్ గ్రూపిజంతో సతమతమవుతోందన్నారు. తమ రాజీనామాకు కారణాలు స్పష్టంగా లేఖ ద్వారా వివరించామని.. అవరసమైతే పదవులకు రాజీనామా చేస్తామని కూడా వివరించినట్లు రేగా తెలిపారు.
రాజ్యాంగబద్ధంగా తమకున్న హక్కుతోనే స్పీకర్‌ను విలీనం కోసం వినతి పత్రం ఇచ్చామని తెలిపారు. స్పీకర్ సైతం విలీనానికి అంగీకరించారని.. అయితే కాంగ్రెస్ పార్టీ అనవసరంగా రాద్ధాంతం చేస్తోందని కాంతారావు ఎద్దేవా చేశారు.
మొన్నటి పరిషత్ ఎన్నికల్లో 32 జడ్పీ పీఠాలను ప్రజలు టీఆర్ఎస్‌కు అప్పగించారని.. ప్రజలు తీర్పు ఇచ్చినా కాంగ్రెస్ బుద్ధి మాత్రం మారడం లేదని ఆయన మండిపడ్డారు. తమ వైఫల్యాలకు కాంగ్రెస్ పార్టీ కారణాలు వెతుక్కోవాలని ... నేతలకు భరోసా ఇవ్వడంలో కాంగ్రెస్ నాయకత్వం విఫలమైందని కాంతారావు ఆరోపించారు.
తమ మీద అనవసర ఆరోపణలు చేస్తే పరువు నష్టం దావా వేస్తామని.. తాము కూడా సుప్రీంకోర్టుకు వెళతామని ఆయన హెచ్చరించారు. విలీనం గురించి రాజ్యాంగం పదో షెడ్యూల్‌లో స్పష్టంగా ఉందని.. కాంగ్రెస్ నేతలకు చదువు రాదా అని కాంతారావు వ్యాఖ్యానించారు. ఉత్తమ్, భట్టి నియోజకవర్గాల్లో పరిషత్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైందని ఆయన గుర్తుచేశారు.
మరో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ... కాంగ్రెస్‌పై తమకున్న అసంతృప్తిని చాలా సార్లు వ్యక్తం చేశామని.. రాజ్యాంగం పదో షెడ్యూల్ ప్రకారమే టీఆర్ఎస్‌లో చేరామని తాము ప్రలోభాలకు లొంగిపోవడానికి, అమ్ముడుపోవడానికి గొర్రెలం, బర్రెలం కాదన్నారు.
కాంగ్రెస్ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదని గండ్ర మండిపడ్డారు. ఎవరు పాలన చేసినా రాజ్యాంగం ప్రకారమే చేస్తారు.. తాము రాజ్యాంగం ప్రకారమే వ్యవహరించామని ఆయన గుర్తు చేశారు.
కాంగ్రెస్ నుంచి చాలా మంది నేతలు పార్టీని వీడుతున్నారు. తమ నిర్ణయాన్ని జడ్పీ ఎన్నికల్లో ప్రజలు సమర్ధించారని.. తన భార్య జ్యోతిని జడ్పీటీసీగా పదివేల ఓట్ల మెజారిటీతో గెలిచారని రమణారెడ్డి గుర్తు చేశారు.
కాంగ్రెస్ నేతలు తమపై విమర్శలు ఆపకపోతే పరువునష్టం దావా వేస్తామని హెచ్చరించారు. త్రిపుర, గోవాలలో కూడా ఇలాంటి విలీనాలే జరిగామని.. ప్రధాని కూడా ఇటీవల బెంగాల్‌లో 40 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని తెలిపిన సంగతిని రమణారెడ్డి ప్రస్తావించారు.
హుజూర్‌నగర్ ఉప ఎన్నికల త్వరలోనే జరుగుతుందని.. ఆ ఎన్నికల్లో తేల్చుకుంటామని. తకు రాజీనామాలు అవసరం లేదని, ఒకవేళ అవసరమని భావిస్తే చేయడానికి వెనుకాడమని గండ్ర స్పష్టం చేశారు.
అభివృద్ధి సంక్షేమమే తమ ప్రాధాన్యమన్నారు. ఎల్‌బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. మమ్మల్ని విమర్శిస్తున్న వారు రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ చదువుకుంటే మంచిదని.. వేరే రాష్ట్రాల్లో ఇలాంటి చాలా జరిగాయని గుర్తు చేశారు,
