Asianet News TeluguAsianet News Telugu

హుజూరాబాద్ బైపోల్‌‌లో పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్ధి: ఆ ముగ్గురి నిర్ణయం తర్వాతే ఫైనల్

హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి ఎంపిక విషయమై నేతల అభిప్రాయాలను తెలుసుకొనేందుకు ఆ పార్టీ ముఖ్య నేతలు సోమవారం నాడు చర్చించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కరీంనగర్ నేతలు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, జీవన్ రెడ్డిల అభిప్రాయాలు తీసుకొన్న తర్వాతే ఎఐసీసీకి నివేదిక పంపాలని నిర్ణయం తీసుకొన్నారు.నేతల అభిప్రాయాలు తీసుకొనేందుకు దామోదర రాజనర్సింహ, భట్టి విక్రమార్కతో కమిటిని ఏర్పాటు చేశారు.

congress appoints two men committee for Negotiations for Huzurabad candidate
Author
Karimnagar, First Published Aug 30, 2021, 4:30 PM IST

హైదరాబాద్: హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధి ఎంపికపై ఉమ్మడి కరీంనగర్  జిల్లాకు చెందిన ముగ్గురు నేతల అభిప్రాయం తర్వాతే ఎఐసీసీకి నివేదిక పంపాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకొంది.

కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల సమావేశం సోమవారం నాడు గాంధీ భవన్ లో జరిగింది.ఈ సమావేశంలో  హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో  పోటీ చేసే అభ్యర్ధి ఎంపిక విషయమై కాంగ్రెస్ నేతలు చర్చించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రులు జీవన్ రెడ్డి, శ్రీధర్ బాబుల అభిప్రాయాలను తీసుకోవాలని ఈ సమావేశంలో నేతలు అభిప్రాయపడ్డారుఈ ముగ్గురి అభిప్రాయాలు తీసుకోవాలని నిర్ణయం తీసుకొన్నారు.

also read:హుజూరాబాద్ ఉప ఎన్నిక: కొండా సురేఖ అభ్యర్ధిత్వం వైపే కాంగ్రెస్ నేతల మొగ్గు

మరోవైపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి ఎంపిక విషయంలో నేతల అభిప్రాయాలు తీసుకొనేందుకు గాను సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క,మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహలతో కాంగ్రెస్ పార్టీ కమిటీని ఏర్పాటు చేసింది. సెప్టెంబర్ 10వ తేదీలోపుగా ఈ కమిటీ నివేదిక ఇవ్వాలని కోరింది.

ఈ సమావేశంలో  కాంగ్రెస్ ముఖ్య నేతల్లో మెజారిటీ నేతలు మాజీ మంత్రి కొండా సురేఖ అభ్యర్థిత్వం వైపు మొగ్గు చూపారని సమాచారం. అయితే  ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ముగ్గురు ముఖ్య నేతలు శ్రీధర్ బాబు, జీవన్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ ల అభిప్రాయం తీసుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు.ఈ ముగ్గురి నిర్ణయం తర్వాతే ఎఐసీసీకి నివేదిక పంపాలని సమావేశం  నిర్ణయించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios