Asianet News TeluguAsianet News Telugu

ఎమ్మెల్యేల భార్యలకు డీసీసీ అధ్యక్ష పదవులు

 తెలంగాణ రాష్ట్రంలోని 31 జిల్లాలకు  డీసీసీ అధ్యక్షులను నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్‌గాంధీ గురువారం నాడు ప్రకటించారు. ఐదుగురు పాత డీసీసీ అధ్యక్షులను కొనసాగించారు. 

congress appoints 31 district dcc presidents in telangana
Author
Hyderabad, First Published Feb 7, 2019, 5:27 PM IST


హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని 31 జిల్లాలకు  డీసీసీ అధ్యక్షులను నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్‌గాంధీ గురువారం నాడు ప్రకటించారు. ఐదుగురు పాత డీసీసీ అధ్యక్షులను కొనసాగించారు. ఇద్దరు ఎమ్మెల్యేల భార్యలకు జిల్లా అధ్యక్ష బాధ్యతలను అప్పగించారు.

యాదాద్రి భువనగిరి జిల్లాకు బిక్షమయ్య గౌడ్ ను డీసీసీ అధ్యక్షుడిగా కొనసాగించారు. భూపాలపల్లి వరంగల్ జిల్లా అధ్యక్షపదవిని  భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి భార్య గండ్ర జ్యోతికి కట్టబెట్టారు.సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షపదవిని జగ్గారెడ్డి సతీమణి నిర్మలకు ఇచ్చారు.

 కరీంనగర్ జిల్లా అధ్యక్ష పదవిలో మృత్యుంజయంను కొనసాగించనున్నారు. మంచిర్యాల డీసీసీ  అధ్యక్షపదవిలో కొక్కిరాల సురేఖ ను నియమించారు. ఖమ్మం సిటీ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ పదవికి  దీపక్ చౌదరిని,  గ్రేటర్ హైద్రాబాద్ అధ్యక్ష పదవిలో అంజన్‌కుమార్ యాదవ్‌ను నియమించారు. మహబూబ్ నగర్ డీసీసీ అధ్యక్ష పదవిలో ఒబేల్లా కొత్వాల్‌ను కొనసాగించనున్నారు.వరంగ్ అర్బన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షపదవిలో  రాజేందర్ రెడ్డి కొనసాగనున్నారు.

కొత్తగా ప్రకటించిన  డీసీసీ అధ్యక్షుల జాబితాలో ఇద్దరు బ్రహ్మణులకు, ఒక్క వెలమ, ఇద్దరు ఎస్టీలకు, ఇద్దరు ఎస్సీలకు, 12 మంది బీసీలకు, ఇద్దరు కమ్మ, 9మంది రెడ్డి , ఒక్క ముస్లింలకు అవకాశం కల్పించారు. అంతేకాదు ముగ్గురు మహిళలకు కూడ అధ్యక్ష పదవులు దక్కాయి. 


డీసీసీ అధ్యక్షుల జాబితా ఇదే

1. ఆదిలాబాద్ - భార్గవ్ దేశ్‌పాండే
2.మంచిర్యాల -కొక్కిరాల సురేఖ
3. కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ -ఆత్రం సక్కు
4.కరీంనగర్ -కె.మృత్యుంజయం
5.జగిత్యాల -ఎ.లక్ష్మణ్ కుమార్
6.పెద్దపల్లి -ఈర్ల కొమరయ్య
7.రాజన్న సిరిసిల్ల -ఎన్. సత్యనారాయణ గౌడ్
8. నిజామాబాద్ -మానాల మనోహర్ రెడ్డి
9.నిజామాబాద్ సిటీ -కేశా వేణు
10.నిర్మల్ - రామారావు పటేల్ పవార్
11. కామారెడ్డి -కైలాష్ శ్రీనివాసరావు
12.వరంగల్ (అర్బన్ ,రూరల్) - నాయిని రాజేందర్ రెడ్డి
13.వరంగల్ సిటీ కాంగ్రెస్ -కేదారి శ్రీనివాసరావు
14.జయశంకర భూపాలపల్లి -గండ్ర జ్యోతి
15.జనగాం -జంగా రాఘవరెడ్డి
16.సంగారెడ్డి -తూర్పు నిర్మల జయప్రకాష్ రెడ్డి
17. మెదక్ -తిరుపతి రెడ్డి
18. సిద్దిపేట- టి. నర్సారెడ్డి
19.వికారాబాద్ -టి.రోహిత్ రెడ్డి
20. మేడ్చల్ మల్కాజిగిరి -కూన శ్రీశైలం గౌడ్
21. రంగారెడ్డి - చల్లా నర్సింహారెడ్డి
22. మహబూబ్‌నగర్ -ఓబేదుల్లా కొత్వాల్
23. వనపర్తి - శంకర్ ప్రసాద్
24.గద్వాల- పటేల్ ప్రభాకర్ రెడ్డి
25.నాగర్‌కర్నూల్- వంశీచంద్ రెడ్డి
26.సూర్యాపేట -చెవిటి వెంకన్న యాదవ్
27. యాదాద్రి భువనగిరి -బిక్షమయ్య గౌడ్
28. మహబూబాబాద్ -జె.భరత్ చంద్రారెడ్డి
29.నల్గొండ -కె.శంకర్ నాయక్
30. భద్రాచలం కొత్తగూడెం -వనమా వెంకటేశ్వరరావు
31. ఖమ్మం- పువ్వాడ దుర్గా ప్రసాద్
ఖమ్మం సిటీ - జావీద్
గ్రేటర్ హైద్రాబాద్ -ఎం. అంజన్ కుమార్ యాదవ్
ఖమ్మం సిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్. దీపక్ చౌదరి

Follow Us:
Download App:
  • android
  • ios