Asianet News TeluguAsianet News Telugu

రాజన్న సిరిసిల్లలో నిరసన సెగ: కేటీఆర్ కాన్వాయ్ కు అడ్డుపడ్డ కాంగ్రెస్

రాజన్న సిరిసిల్ల  జిల్లాలోని ఎల్లారెడ్డిపేటలో  మంత్రి కేటీఆర్ కాన్వాయ్ ను  కాంగ్రెస్ శ్రేణులు   ప్రయత్నించాయి. 

Congress  activists try to block KTR convoy in Rajanna Sircilla lns
Author
First Published May 2, 2023, 2:32 PM IST

సిరిసిల్ల:  రాజన్న సిరిసిల్ల జిల్లాలోని  ఎల్లారెడ్డిపేటలో  మంత్రి కేటీఆర్   కాన్వాయ్ ను  కాంగ్రెస్ శ్రేణులు  మంగళవారంనాడు అడ్డుకొనే ప్రయత్నం  చేశాయి.  అకాల వర్షంతో  పంట నష్టపోయిన రైతులను ఆదుకొనేందుకు  నియోజకవర్గంలో  ఇవాళ కేటీఆర్ పర్యటించారు.   ఎల్లారెడ్డిపేటలో  కేటీఆర్ కాన్వాయ్ కు  కాంగ్రెస్ శ్రేణులు అడ్డుపడ్డాయి.  ప్లకార్డులు  పట్టుకొని  నిరసనకు దిగారు. కేటీఆర్ కాన్వాయ్ లోని వాహనాలకు అడ్డుపడ్డారు.  కాంగ్రెస్ శ్రేణులను  పోలీసులు  అరెస్ట్  చేశారు. 

అకాల వర్షానికి  తడిచిన ధాన్యాన్ని  ధాన్యాన్ని కొనుగోలు  చేయాలని కాంగ్రెస్ డిమాండ్  చేసింది.  అనంతరం దెబ్బతిన్న పంట పొలాలను  మంత్రి కేటీఆర్ పరిశీలించారు.  రైతులతో మాట్లాడారు. పంట నష్టం గురించి ఆరా తీశారు. రైతులకు ధైర్యం చెప్పారు. ప్రభుత్వం అండగా ఉంటుందని  మంత్రి హామీ ఇచ్చారు.

రాష్ట్రంలో దాదాపు వారం రోజులుగా  అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా  చేతికొచ్చిన  పంట దెబ్బతింది. గత మంగళశారంనాడు మంగళవారంనాడు  భారీ వర్షం కురిసింది. ఆ తర్వాత  రోజు నుండి కూడ  వర్షాలు కురుస్తున్నాయి.  ప్రాథమిక అంచనాల మేరకు  రాష్ట్రంలోని  27 జిల్లాల్లో  4.5 లక్షల ఎకరాల్లో  పలు పంటలు దెబ్బతిన్నాయి.  పంట నష్టపోయిన  రైతులకు  ఎకరానికి  రూ. 10 వేల చొప్పున పరిహరం చెల్లించనున్నట్టుగా  ప్రభుత్వం  ప్రకటించింది.   రానున్న  రెండు మూడు  రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని   వాతావరణ శాఖ ప్రకటించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios