హైదరాబాద్: టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ పై కమెడియన్ పృథ్వి ప్రశంసలు వర్షం కురిపించారు. కేసీఆర్ పై సినీ డైలాగులు వదిలారు. కేసీఆర్ మగాడని.. సింహం సింగిల్‌గా వస్తుందన్నట్టు ఆయన ప్రయాణం ఉంటుందన్నారు. తెలంగాణలో ఎన్ని పార్టీలు వచ్చినా ఏం కాదని టీఆర్ఎస్ పార్టీదే విజయమన్నారు. 

ఓ మీడియా ఛానెల్ లో మాట్లాడిన పృథ్వి కేసీఆర్‌కు అనైతిక కలయికలు లేవన్నారు. మహాకూటమి అధికారం కోసమే పని చేస్తోందని విమర్శించారు. ఎంతో మంది ప్రాణత్యాగం చేసిన తెలంగాణ గడ్డపై మహాకూటమికి ఓటేస్తే అమరావతి నుంచి పాలన ఉంటుందని ధ్వజమెత్తారు. 

ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఓటేసి గెలిపించాలని ప్రజలకు, కవులకు, కళాకారులకు, మేధావులకు, ఉద్యమకారులకు పృథ్వి పిలుపునిచ్చారు. అంతా విజ్ఞతతో ఆలోచించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్‌కు సరితూగే నాయకుడు ఎవరూ లేరన్నారు. కాంగ్రెస్ విడిగా పోటీ చేసి ఉంటే ఐదారు సీట్లు వచ్చేవని పృథ్వి వ్యాఖ్యానించారు.  

ఈ వార్తలు కూడా చదవండి

బండ్ల గణేష్ ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకోవాలి:పృథ్వి