తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ రావు విశాఖపట్నం బయలుదేరారు. కుటుంబసభ్యులతో పాటు బేగంపేట విమానాశ్రయం చేరుకున్న ఆయన ప్రత్యేక విమానంలో విశాఖపట్నం బయలుదేరారు. మధ్యాహ్నాం 12 గంటలకు విశాఖకు చేరుకుంటారు.

అక్కడ శారదాపీఠాన్ని సందర్శించి...స్వామిజీ ఆశీర్వచనాలు తీసుకుని రాజశ్యామల ఆలయంలో ముఖ్యమంత్రి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. శారదా పీఠంలోనే భోజనం చేసి అనంతరం ఒడిశా రాజధాని భువనేశ్వర్‌కు బయలుదేరుతారు.

సాయంత్రం 6 గంటలకు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో సమావేశమవుతారు. రాత్రికి సీఎం అధికార నివాసంలో కేసీఆర్ బస చేస్తారు. విశాఖ బయలుదేరడానికి ముందు హోంమంత్రి మహమూద్ అలీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దట్టీ కట్టారు.