యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ గురువారం నాడు పరిశీలించారు.

గురువారం నాడు  హైద్రాబాద్ నుండి రోడ్డు మార్గంలో కేసీఆర్ యాదాద్రికి చేరుకొన్నారు. సీఎం కేసీఆర్ కు అర్చకులు, ఆలయ అధికారులు స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్ ఆలయంలో స్వామిని దర్శించుకొన్నారు. తీర్ధప్రసాదాలు స్వీకరించారు.

ఆలయ నిర్మాణ పనులు సుమారు 90 శాతానికి పైగా పూర్తయ్యాయి. మిగిలిన పనులను కూడ త్వరలోనే పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఆలయ ప్రారంభతేదీని సీఎం కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉంది. 

ఈ ఆలయ పునర్నిర్మాణ పనులను ఈ  ఏడాది  ఫిబ్రవరి మాసానికి పూర్తి చేయాలని భావించారు. కానీ కొన్ని కారణాలతో ఈ పనులను ఇంకా మిగిలిపోయాయి. ఈ పనులను కూడ త్వరలోనే పూర్తి  చేయాలని సీఎం కేసీఆర్  అధికారులను ఆదేశించారు. 

ఆలయ పునర్నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ పరిశీలించారు. అవసరమైన సలహాలు, సూచలను అధికారులకు ఇచ్చారు. ఈ పనులను వెంటనే పూర్తి చేయాలని ఆయన కోరారు.