Asianet News TeluguAsianet News Telugu

ప్రధాని మోదీ సేల్స్‌మెన్‌గా వ్యవహరిస్తున్నారు.. మా ప్రశ్నలకు హైదరాబాద్ వేదికగా సమాధానం చెప్పండి: సీఎం కేసీఆర్

నరేంద్ర మోదీ దేశానికి ప్రధానిగా కాకుండా సేల్స్‌ మెన్‌లా వ్యవహరిస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. మోదీ పాలనలో దేశ ప్రతిష్టను మసకబారేలా చేశారని ఆరోపించారు. 

CM KCR Speech at jalavihar supporting yashwant sinha in president election
Author
First Published Jul 2, 2022, 2:07 PM IST

నరేంద్ర మోదీ దేశానికి ప్రధానిగా కాకుండా సేల్స్‌ మెన్‌లా వ్యవహరిస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. మోదీ పాలనలో దేశ ప్రతిష్టను మసకబారేలా చేశారని ఆరోపించారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతుగా హైదరాబాద్ జలవిహార్‌లో టీఆర్ఎస్ సభను ఏర్పాటు చేసింది. ఈ సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. యశ్వంత్ సిన్హాది ఉన్నత వ్యక్తిత్వం అని చెప్పారు. తెలంగాణ ప్రజల పక్షాన యశ్వంత్ సిన్హాకు హృదయపూర్వక స్వాగతం చెబుతున్నట్టుగా తెలిపారు. ఆయన వివిధ హోదాల్లో దేశానికి అత్యుత్తమ సేవలు అందించారని గుర్తుచేశారు. 

భారత రాజకీయాల్లో యశ్వంత్ సిన్హాది కీలక పాత్ర అని కేసీఆర్ అన్నారు. యశ్వంత్ సిన్హాకు అన్ని రంగాల్లో విశేష అనుభవం ఉందన్నారు. న్యాయవాదిగా కేరీర్ ప్రారంభించి ఆర్థిక మంత్రిగా సేవలందించారని గుర్తుచేశారు. ఆత్మప్రబోధానుసారం రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయాలని అన్నారు. అభ్యర్థులను బేరీజు వేసుకుని నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఉత్తమ, ఉన్నతమైన వ్యక్తి రాష్ట్రపతిగా ఉంటే దేశ ప్రతిష్ట మరింత ఇనుమడిస్తుందని చెప్పారు. యశ్వంత్ సిన్హా గెలుస్తారనే విశ్వాసం ఉందన్నారు. ఆయన గెలిస్తే దేశ గౌరవం రెట్టింపు అవుతుందన్నారు. దేశానికి గుణాత్మక మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు. 

ప్రధాని మోదీ వ్యవసాయ చట్టాలు తెచ్చి రైతులను ఇబ్బందిపెట్టారని విమర్శించారు. వ్యవసాయ చట్టాలపై రైతులు సుదీర్ఘ పోరాటం చేశారని గుర్తుచేశారు. ఉద్యమంలో దాదాపు 700 మంది రైతులు మృతిచెందారని అన్నారు. ఉద్యమంలో మృతిచెందిన రైతుల కుటుంబాలకు రూ. 3 లక్షలు అదజేశామన్నారు. రైతు కుటుంబాలకు సాయం చేస్తే బీజేపీ చులకనగా చూసిందన్నారు. రైతు చట్టాలు సరైనవే అయితే ఎందుకు వెనక్కి తీసుకున్నారని ప్రశ్నించారు. దేశంలో ఎరువులు, నిత్యావసరాలు, అన్ని రకాల ధరలు పెంచారని మండిపడ్డారు. రైతులు మీకు ఉగ్రవాదులు, వేర్పాటువాదులుగా కనిపిస్తున్నారా అని ప్రశ్నించారు. మోదీ ఎన్నికలప్పుడు తియ్యటి మాటలు చెబుతారని ప్రశ్నించారు. మోదీ తనను తాను మేధావిగా భావిస్తున్నారని అన్నారు. 

 

ప్రధాని మోదీ ఈరోజు హైదరాబాద్ వస్తున్నారని.. రెండు రోజులు మోదీ ఇక్కడ ఉండబోతున్నారని చెప్పారు. రేపటి సభలో తమ గురించి బాగానే మాట్లాడబోతున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మోదీ ప్రతిపక్ష నేతలపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తాము వేసిన ప్రశ్నలకు హైదరాబాద్ వేదికగా ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 

మోదీ పాలనలో ఓ ఒక్కరూ సంతోషంగా లేరని అన్నారు. మోదీ ఇచ్చిన ఎన్నికల హామీల్లో ఏ ఒక్కటి నెరవేరలేదని అన్నారు. టార్చిలైట్ వేసి వెతికినా మోదీ హామీలు నెరవేర్చినట్టుగా కనిపించవన్నారు. డిజీల్ సహా అన్ని ధరలు విపరీతంగా పెంచేశారని మండిపడ్డారు. మోదీ పాలనలో రైతులు, సైనికులు, ఉద్యోగులు, నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పిన మోదీ.. వారి ఖర్చులను రెట్టింపు చేశారని విమర్శించారు. ప్రధానిగా శాశ్వతంగా ఉంటాననే భ్రమలో మోదీ ఉన్నారని విమర్శించారు.

శ్రీలకంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో కళ్లారా చూస్తున్నామని చెప్పారు. మోదీ ప్రధానమంత్రిలా కాకుండా సేల్స్‌మెన్‌లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ వ్యవస్థను దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ‘‘వికాసం పేరుతో మోదీ దేశాన్ని నాశనం చేశారు. మోదీ పాలనలో అంతా తిరోగమనమే. ఇప్పటివరకు ఎంత నల్లధనం వెనక్కి తీసుకొచ్చారో ప్రధాని మోదీ సమాధానం చెప్పాలి..?. మోదీ పాలనలో నల్లధనం నియంత్రణ కాదు.. రెట్టింపు అయింది. మోదీ పాలనలో అవినీతి పెరిగింది. ఇదేనా వికాసం అంటే..?. మోదీ ప్రధానిగా కాదు.. దోస్త్ షాపుకారు కోసం సేల్స్‌మెన్‌గా పనిచేస్తున్నారు’’ అని ఆరోపించారు

తాము వీటన్నింటిని చూస్తూ మౌనంగా ఉండమని.. పోరాటం చేస్తామని చెప్పారు. మోదీ కారణంగా దేశ ప్రజలు తలదించుకోవాల్సి వస్తోందని విమర్శించారు. మోదీ పాలనలో కొంతైనా నిజాయితీ ఉందా అని ప్రశ్నించారు. మోదీ పాలనలో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోందన్నారు. మేకిన్ ఇండియా అంటే ఇదేనా అని ప్రశ్నించారు. పెద్ద కంపెనీలు అన్ని దేశం నుంచి వెళ్లిపోయాయని చెప్పారు. ఇలాగే చూస్తు కూర్చుంటే దేశం సర్వనాశనం అవుతుందన్నారు. వ్యక్తిగతంగా మోదీతో తనకు ఎలాంటి విబేధాలు లేవని చెప్పారు. 

‘‘బొగ్గు నిల్వలు పుష్కలంగా ఉన్నప్పటికీ.. ఎందుకు దిగుమతి చేసుకుంటున్నారని ప్రశ్నించారు. రూపాయి పతనంపై మన్మోహన్ సింగ్ హయాంలో గొంతు చించుకున్నారని చెప్పారు. మరి మీ పాలనలో రూపాయి ఎలా పతనమవుతుందో రేపు మాట్లాడండి. రూపాయి పతనం చూస్తే మీ పాలన ఎంత గొప్పదో అర్థమవుతుంది. నేపాల్, బంగ్లాదేశ్ రూపాయి విలువ పడిపోదు.. మరి భారత్‌కు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది’’ అని కేసీఆర్ ప్రశ్నించారు. 

‘‘రూపాయి పతనంపై మన్మోహన్ సింగ్ హయాంలో గొంతు చించుకున్నారు. మరి మీ పాలనలో రూపాయి ఎలా పతనమవుతుందో రేపు మాట్లాడండి. రూపాయి పతనం చూస్తే మీ పాలన ఎంత గొప్పదో అర్థమవుతుంది. నేపాల్, బంగ్లాదేశ్ రూపాయి విలువ పడిపోదు.. మరి భారత్‌కు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది?. మోదీ తీరుతో శ్రీలకంలో ప్రజలు నిరసనలు తెలిపారు. మోదీ పనితీరుతో అంతర్జాతీయ స్థాయిలో దేశ ప్రతిష్ట దిగజారుతోంది. శ్రీలంక చేసిన ఆరోపణలపనై ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారు?. శ్రీలకం విషయంలో మోదీ స్పందించకుంటే దోషిగానే చూడాల్సి వస్తుంది. మీరు దోషి కాదని రేపటి బహిరంగ సభలో వివరణ ఇవ్వండి’’ అని కేసీఆర్ అన్నారు. 

మోదీపై జనంలో ఆగ్రహం పెరుగుతోందని కేసీఆర్ అన్నారు. కరోనా నియంత్రణలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఆకస్మాత్తుగా లాక్‌డౌన్ ప్రకటించిన జానాన్ని రోడ్డుపాలు చేశారని మండిపడ్డారు. బీజేపీ విధానాలతో దేశం అన్ని విధాలు నష్టపోతుందన్నారు. ఇప్పటివరకు 9 ప్రభుత్వాలను పడగొట్టారని విమర్శించారు. మత విద్వేషాలతో దేశాన్ని కలుషితం చేస్తున్నారని మండిపడ్డారు. ఇదేనా ప్రజలు కోరుకుంటున్న భారతదేశం అని బీజేపీని ప్రశ్నించారు. మహారాష్ట్ర తరహాలో తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తున్నారని.. కొందరు బీజేపీ నేతలు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. అలాగే చేయాలని.. తాము బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని హెచ్చరించారు. జాతిపిత గాంధీని కూడా బీజేపీ అవమానిస్తోందన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios