సిద్దిపేట: జిల్లాలోని కొండపోచమ్మ సాగర్ నుండి సంగారెడ్డి కాలువకు తెలంగాణ సీఎం కేసీఆర్ మంగళవారం నాడు నీటిని విడుదల చేశారు.ఇవాళ ఉదయం ప్రగతి భవన్ నుండి రోడ్డు మార్గంలో సీఎం కేసీఆర్  కొండపోచమ్మ సాగర్ వద్దకు చేరుకొన్నారు. ఈ ప్రాజెక్టు నుండి నీటిని విడుదల చేశారు. దీంతో ఆరు మండలాల్లోని 30 వేల మంది రైతులకు లబ్ది చేకూరనుంది. సుమారు 15 వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది.

మరోవైపు పాములపర్తి వద్ద గజ్వేల్ కాలువకు కూడ సీఎం కేసీఆర్ నీటిని విడుదల చేశారు. గజ్వేల్ నియోజకవర్గంలో 18, నర్సాపూర్ లో 10, మెదక్ లో 4 చెక్ డ్యామ్ లకు నీరు అందనుంది.కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు వద్ద గోదావరి నదికి సీఎం కేసీఆర్ పూజలు నిర్వహించారు. ఆ తర్వాత నీాటిని విడుదల చేశారు. 

నీటిని విడుదల చేసిన తర్వాత సీఎం కేసీఆర్ రైతులకు అబివాదం చేశారు. సీఎం కేసీఆర్ వెంట తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రి హరీష్ రావు, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.