తెలంగాణ సీఎం కేసీఆర్.. ఆర్థిక మంత్రిగా ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను శుక్రవారం  శాసనసభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్‌ ప్రసంగాన్ని సీఎం కేసీఆర్‌ చదివి వినిపిస్తున్నారు. బడ్జెట్‌ ప్రవేశపెట్టేకంటే ముందు పుల్వామా ఉగ్రదాడిలో వీరమరణం పొందిన అమర జవాన్లకు సంతాపం తెలియజేశారు. అమర జవాన్లకు నివాళి అనంతరం సభకు టీ విరామం ప్రకటించారు. 

వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన సభలో బడ్జెట్ ను సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారు. ఆంధ్ర రాష్ట్ర మొదటి సీఎం బెజవాడ గోపాల్‌ రెడ్డి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాసు బ్రహ్మానంద రెడ్డి, రోశయ్య ముఖ్యమంత్రులుగా ఉండి బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. వారి తర్వాత ముఖ్యమంత్రి హోదాలో బడ్జెట్‌ ప్రవేశపెడుతున్నది సీఎం కేసీఆర్ కావడం విశేషం