హైదరాబాద్:కళా తపస్వి కె. విశ్వనాథ్ ఇంటికి తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదివారం నాడు వెళ్లారు. మర్యాదపూర్వకంగానే కేసీఆర్ విశ్వనాథ్‌ను కలిసినట్టుగా సమాచారం.

ఆదివారం మధ్యాహ్నం కేసీఆర్  కళా తపస్వి కె.విశ్వనాథ్ ఇంటికి వెళ్లారు. సీఎం కేసీఆర్ తో సినీ దర్శకుడు శంకర్, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డితో పాటు పలువురు పార్టీ నేతలు ఉన్నారు.

మర్యాదపూర్వకంగానే డైరెక్టర్ విశ్వనాథ్ ఇంటికి సీఎం కేసీఆర్ వెళ్లినట్టుగా సీఎంఓ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల కాలంలో డైరెక్టర్  విశ్వనాథ్ అనారోగ్యానికి గురౌతున్నారు.  విశ్వనాథ్ ఆరోగ్య పరిస్థితి గురించి ఆయన అడిగి తెలుసుకొన్నారు.

రాజకీయాల గురించి తమ మధ్య చర్చలు జరగలేదని కె.విశ్వనాథ్ ప్రకటించారు. రచనల గురించే కేసీఆర్ తన గురించి చర్చించినట్టుగా విశ్వనాథ్ చెప్పారు. తాను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్టుగా ఆయన  తేల్చి చెప్పారు. కేసీఆర్ లో ఇన్ని కోణాలు ఉన్నట్టుగా తాను ఇవాళే తెలుసుకొన్నానని విశ్వనాథ్ మీడియాకు వివరించారు. 

"