తెలంగాణకు కొత్త ప్రభుత్వం ఏర్పడిన కొత్తల్లో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నమన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా సిర్పూర్ కాగజ్‌నగర్‌లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న కేసీఆర్... మన వద్ద అధికారులు లేరని, విద్యుత్ సమస్యలు, పక్క రాష్ట్రంతో ఇబ్బందులు పడ్డామని కేసీఆర్ గుర్తుచేశారు.

రాత్రికి రాత్రి తెలంగాణలోని ఏడు మండలాలను ఆంధ్రాలో కలిపారని కేసీఆర్ తెలిపారు. పాలనా యంత్రాంగం కుదురుకుని, సమస్యలు పరిష్కారం కావడానికి ఐదేళ్లు పట్టిందన్నారు. ఆత్మహత్యలకు పాల్పడిన వారు, ఉద్యమకారుల కుటుంబాలకు తొలి ఏడాది న్యాయం చేశామన్నారు.
సంక్షేమం, ప్రగతి కుంటుపడకూడదనే ఉద్దేశ్యంతోనే తాను ముందస్తు ఎన్నికలు తెచ్చానని కేసీఆర్ ప్రజలకు తెలిపారు. ఆయుష్మాన్ పథకం కంటే నిరుపయోగమని సీఎం అన్నారు. ముస్లిం రిజర్వేషన్లు కల్పించమంటే.. పెంచేది లేదని బీజేపీ నేతలు అంటున్నారని ఇండియా వాళ్ల జాగీరా అని కేసీఆర్ ప్రశ్నించారు.
కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా తాను ఫెడరల్ ఫ్రంట్ కోసం పోరాడుతున్నానని అందుకే కేసీఆర్ అంటే భయపడుతున్నారని సీఎం ఎద్దేవా చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వనంటే ఏ ఒక్క కాంగ్రెస్ నేత కూడా మాట్లాడలేదన్నారు కేసీఆర్.
పదవులను గడ్డిపోచల్లా భావించి రాజీనామాలు చేశామని గుర్తు చేశారు. తెలంగాణను మరోసారి కాకులు, గద్దలకు అప్పగిస్తారా అని కేసీఆర్ ప్రజలను ప్రశ్నించారు. పోడు భూముల్లో వ్యవసాయం చేసే వారికి పట్టా భూములు అందిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.