Asianet News TeluguAsianet News Telugu

ఆర్టీసీ కార్మికులవి న్యాయమైన డిమాండ్లే... గొంతెమ్మ కోరికలు కాదు: భట్టి

ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై స్పందించిన ఆయన ఒకేసారి 45 వేల మంది ఉద్యోగులను ఒకేసారి తొలగిస్తామనడం అప్రజాస్వామకమని ఆయన మండిపడ్డారు. 

clp leader mallu bhatti vikramarka fires on cm kcr over rtc strike
Author
Hyderabad, First Published Oct 7, 2019, 2:58 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై స్పందించిన ఆయన ఒకేసారి 45 వేల మంది ఉద్యోగులను ఒకేసారి తొలగిస్తామనడం అప్రజాస్వామకమని ఆయన మండిపడ్డారు.

ఆర్టీసీ కార్మికులు ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఎన్నో హామీలు ఇచ్చారని.. ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం ఉద్యోగులతో సమానంగా వేతనాల ఇస్తామని చెప్పిన విషయాన్ని భట్టి గుర్తు చేశారు.

డీజీల్ భారాన్ని ప్రభుత్వమే భరించాలని ఆర్టీసీ యాజమాన్యం ఎన్నో ఏళ్లుగా అడుగుతోందన్నారు. ఇంధనంపై ఏ రాష్ట్రంలోనూ లేనంత వ్యాట్ తెలంగాణలో ఉందని విక్రమార్క వెల్లడించారు.

డీజిల్ ధరలు రెట్టింపు అయినప్పటికీ ఇంత వరకు ఆర్టీసీ ఛార్జీలను పెంచలేదని భట్టి విమర్శించారు. మద్యం, ఇతర వాటిపై వస్తున్న ఆదాయంతో ఆర్టీసీ నష్టాలను కొంతమేర పూడ్చాలని విక్రమార్క కోరారు. ఆర్టీసీ కార్మికులవి న్యాయమైన డిమాండ్లేనని గొంతెమ్మ కోరికలు కాదని భట్టి తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios