టీఆర్ఎస్‌ఎల్పీలో సీఎల్పీ విలీనాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. దీక్ష కొనసాగిస్తున్న భట్టి విక్రమార్కను సోమవారం ఉదయం అరెస్ట్ చేసిన పోలీసులు.. నిమ్స్‌కు తరలించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసుల్ని అడ్డుకునేందుకు ప్రయత్నించగా కాసేపు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది