కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లిలో ఓ బట్టల దుకాణం యజమాని మహిళలకు బంపర్ ఆఫరిచ్చాడు. దీంతో షాపు తీయడానికి ముందే వందలాది మంది  మహిళలు ఆ దుకాణం ముందు క్యూ కట్టారు. దీంతో తోపులాట చోటు చేసుకొంది.

పెద్దపల్లిలోని బట్టల దుకాణం యజమాని రూ. 20లకే ఓ చీర ఇస్తానని బంఫర్ ఆఫరిచ్చాడు దీంతో గురువారం నాడు దుకాణం తెరవడానికి ముందే వందలాది మహిళలు  బట్టల షాపు ముందు క్యూ కట్టారు.  

దుకాణం తలుపులు తెరవడానికి  కూడ షాపు నిర్వాహకులు ఇబ్బందిపడ్డారు. షాపు తలుపులు తెరిచిన తర్వాత దుకాణంలోకి వెళ్లేందుకు మహిళలు పోటీపడ్డారు.  దీంతో తోపులాట చోటు చేసుకొంది. ఈ ఘటనలో పలువురు మహిళలకు స్వల్పంగా గాయపడ్డారు.

అతి తక్కువ ధరకే వచ్చే చీరలను కొనుగోలు చేసేందుకు  మహిళలు పోటీలు పడ్డారు.