యాదాద్రి: క్షణికావేశంతో ఓ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తాను చదువుతున్న పాఠశాలలో క్లాస్ లీడర్ గా ఎన్నిక కాలేదని అతను బలవన్మనరణానికి పాల్పడ్డాడు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. 

భువనగిరిలోని ఓ పాఠశాలలో మూడు రోజుల క్రితం క్లాస్ లీడర్ ఎన్నికలు జరిగాయి. ఎనిమిదవ తరగతిలో చరణ్ అనే విద్యార్థి క్లాస్ లీడర్ గా పోటీ చేశాడు. అయితే అతను ఓడిపోయాడు. 

క్లాస్ లీడర్ గా ఓ అమ్మాయి విజయం సాధించింది. దీంతో తీవ్ర మన స్తాపానికి గురైన చరణ్ రామన్నపేట సమీపంలోని రైల్వే ట్రాక్ పై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనపై చరణ్ తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు .పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు .

చరణ్ జులై 18వ తేదీన అదృశ్యమయ్యాడని, అతని శవం రామన్నపేట రైల్వే ట్రాక్ పై కనిపించిందని భువనగిరి డిసీపీ ఎన్ రెడ్డి చెప్పారు.