Asianet News TeluguAsianet News Telugu

మ్యాథ్స్ అంటే ఇష్టం లేదు .. 15వ అంతస్తు నుంచి దూకి ఆరో తరగతి విద్యార్ధిని ఆత్మహత్య

హైదరాబాద్ చందానగర్‌లో అపార్ట్‌మెంట్ పైనుంచి దూకి ఆరో తరగతి బాలిక ఆత్మహత్య చేసుకుంది. అయితే మ్యాథ్స్ సబ్జెక్ట్‌ ఇష్టం లేదంటూ చిన్నారి బలవన్మరణానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది.

Class 6 student commits suicide by jumping from 15th floor of residential building in hyderabad ksp
Author
First Published Sep 29, 2023, 9:24 PM IST

హైదరాబాద్ చందానగర్‌లో దారుణం చోటు చేసుకుంది. అపార్ట్‌మెంట్ పైనుంచి దూకి ఆరో తరగతి బాలిక ఆత్మహత్య చేసుకుంది. సాయంత్రం ఇంటి నుంచి నల్లగండ్లలో వున్న ట్యూషన్‌కు వెళ్లిన చిన్నారి.. అపార్ట్‌మెంట్‌లోని 15వ అంతస్తు నుంచి దూకింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలిస్తున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే మ్యాథ్స్ సబ్జెక్ట్‌ ఇష్టం లేదంటూ చిన్నారి బలవన్మరణానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios