Asianet News TeluguAsianet News Telugu

జూపల్లి వర్సెస్ హర్షవర్ధన్: ఇరువర్గాల మధ్య ఘర్షణ

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని  పెంట్లవెల్లి ఎంపీపీ ఎన్నికల సమయంలో  మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి వర్గీయుల మధ్య శుక్రవారం నాడు  ఘర్షణ చోటు చేసుకొంది. దీంతో పోలీసులు  లాఠీచార్జీ చేశారు.

clashes between jupally, harshavardhan reddy  cadre at kollapur in mahaboobnagar district
Author
Kollapur, First Published Jun 7, 2019, 1:56 PM IST

జూపల్లి వర్సెస్ హర్షవర్ధన్: ఇరువర్గాల మధ్య ఘర్షణ

కొల్లాపూర్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని  పెంట్లవెల్లి ఎంపీపీ ఎన్నికల సమయంలో  మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి వర్గీయుల మధ్య శుక్రవారం నాడు  ఘర్షణ చోటు చేసుకొంది. దీంతో పోలీసులు  లాఠీచార్జీ చేశారు.

పెంట్లవెల్లి మండలంలో ఆరుగురు ఎంపీటీసీ స్థానాలను టీఆర్ఎస్ గెలుచుకొంది. గెలిచిన  ఎంపీటీసీల్లో  ముగ్గురు ఎంపీటీసీ స్థానాలు హర్షవర్ధన్ రెడ్డి వర్గీయులు విజయం సాధించారు. ఇద్దరు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు వర్గీయులుగా ఉన్నారు. ఒక్క స్థానం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

అయితే తమ వర్గానికి చెందిన వారే ఎంపీపీగా ఎన్నిక కావాలని జూపల్లి, హర్షవర్ధన్ రెడ్డిలు పట్టుబట్టారు. ఈ విషయమై పెంట్లవెల్లి ఎండిఓ వద్ద జూపల్లి కృష్ణారావు, హర్షవర్ధన్ రెడ్డి వర్గీయులు బాహ బాహీకి దిగారు. దీంతో పోలీసులు లాఠీ చార్జీ రెండు వర్గాలను చెదరగొట్టారు.

గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నుండి  కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసిన హర్షవర్ధన్ రెడ్డి విజయం సాధించి టీఆర్ఎస్‌లో చేరారు. సీఎల్పీ ని టీఆర్ఎస్‌ఎల్పీలో విలీనం చేసే ప్రక్రియలో హర్షవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios