భద్రాద్రి జిల్లాలో పెళ్లి మండపంలో ఘర్షణ: వరుడి బంధువులను చితక బాదిన గ్రామస్థులు, ఉద్రిక్తత
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం బోంబాయి తండాలో పెళ్లి కొడుకు బందవులు, స్థానికులకు మధ్య ఘర్షణ చోటు చేసుకొంది. ఈ ఘటనలో నలుగురు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించేందుకు యత్నించిన ఎస్ఐపై కూడా గ్రామస్తులు దాడికి యత్నించారు.
ఇల్లెందు: Bhadradri kothagudem జిల్లా Yellandu మండలం బొంబాయి తండాలో పెళ్లి కొడుకు బంధువులు స్థానికులకు ఘర్షణ చోటు చేసుకొంది. ఈ ఘటనలో గాయడిప వారిని ఆసుపత్రికి తరలించకుండా స్థానికులు అడ్డుకున్నారు. ఆసుపత్రికి తరలిస్తున్న ఎస్ఐ Ramana Reddy పై కూడా స్థానికులు దాడికి దిగారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
also read:గచ్చిబౌలి గురుకుల స్కూల్‌లో విద్యార్ధుల మధ్య ఘర్షణ:విద్యార్ధి గొంతు కోసిన మరో స్టూడెంట్
Marriage జరిగిన పెళ్లి మండపంలో పెళ్లి కొడుకు బంధువులు, స్థానికులకు మధ్య చిన్న గొడవ జరిగింది. పెళ్లి సందర్భంగా భోజనం చేసే సమయంలో పెళ్లి కొడుకు బంధువులు, స్థానికులకు మధ్య గొడవ జరిగింది. ఈ సమయంలో Groom బంధువులు తమ వద్ద ఉన్న కత్తులు చూపారు. దీంతో గ్రామస్తులు, పెళ్లి కొడుకు బంధువులకు మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకొంది. తమ గ్రామానికి వచ్చి తమనే బెదిరిస్తారా అని గ్రామస్థులు పెళ్లి కొడుకు బంధువులను కొట్టారు. ఇరు వర్గాలు కూడా కొట్టుకున్నాయి. తమకు క్షమాపణ చెబితే వారిని గ్రామం నుండి వదిలివేస్తామని చెప్పారు. ఈ ఘర్షణ విషయమై పోలీసులకు సమాచారం అందింది.
వెంటనే రమణారెడ్డి బలగాలతో తండాకు చేరుకున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తన వాహనంలో తీసుకెళ్లుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. ఎస్ఐతో వాగ్వాదానికి దిగారు.ఎస్ఐపై కూడా దాడికి యత్నించారు. ఈ సఃమయంలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించేందుకు స్వల్పంగా లాఠీచార్జీ జరిగింది.
ఇరు వర్గాల దాడిలో నలుగురు గాయపడ్డారు. వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.గ్రామంలో గొడవకు కారణమైన వారిని గుర్తించి వారిపై కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.