తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ. తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను 24 నుంచి 42కి పెంచారు.

తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ. తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను 24 నుంచి 42కి పెంచారు. జడ్జిల సంఖ్యను 75 శాతం పెంచారు. రెండేళ్లుగా మూలనపడిన హైకోర్టు ఫైలును సీజేఐ వెలికితీశారు. హైకోర్టు విజ్ఞప్తిని ప్రధాన న్యాయమూర్తి మన్నిస్తూ.. ఆ దస్త్రానికి ఆమోద ముద్ర వేశారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred