మెట్రో స్టేషన్ లోని లిఫ్ట్ ని.. ఇటీవల కొందరు యువతీ యువకులు రొమాన్స్ కి అడ్డాగా మార్చుకున్నారు. పబ్లిక్ ప్లేస్ అని కూడా చూడకుండా.. ముద్దులుపెట్టుకున్నారు. కాగా.. లిఫ్ట్ లో ఉన్న సీసీ కెమేరా ద్వారా ఆ వీడియోలు కాస్త ఇప్పుడు వైరల్ గా మారాయి. ప్రస్తుతం యూట్యూబ్ లలో ఈ వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి.

ఈ వీడియోలను చూసి.. యువత పాడైపోతున్నారంటూ కొన్ని టీవీ ఛానెళ్లు ఇప్పటికే చర్చా వేదికలు కూడా నిర్వహించారు. కొందరేమో ఛీఛీ ఇదేం పాడుపని అని తిట్టుకుంటున్నారు. కాగా.. తాజాగా.. ఈ ఘటనపై సినీ క్రిటిక్, బిగ్ బాస్ 1 కంటిస్టెంట్ కత్తి మహేష్ స్పందించారు. సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. 

‘‘లిఫ్టులో 'ముద్దా'యిల వీడియోలు ఇప్పుడే ఒక ఛానెల్ లో చూస్తున్నాను. ఆ వీడియోలో అమ్మాయిలు చూపిన చొరవ అభినందనీయం. పార్కుల్లో,థియేటర్లలో నిషేధాలు విధిస్తే మెట్రో లిఫ్టుల్ని యువత క్రియేటివ్ గా వాడటం ముదావహం.ఈ వైఖరుల్ని నిరసిస్తున్న సంఘాలని మీడియాని నేను ఖండిస్తున్నాను.’’ అంటూ పోస్టు చేశారు.