మహబూబాబాద్: శాసనసభ్యురాలు హరిప్రియ నాయక్ పర్యటనలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఆమె పర్యటనలో ప్రమాదానికి సిఐ రమేష్, కానిస్టేబుల్ రమేష్ తీవ్రంగా గాయపడ్డారు. వారిని హరిప్రియ కారులో బయ్యారం ఆస్పత్రికి తరలించారు. 

నిత్యావసర సరుకుల పంపిణీకి వెళ్తున్న హరిప్రియకు రక్షణగా బైక్ పై సీఐ రమేష్, కానిస్టేబుల్ రమేష్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. సీఐ రమేష్ బైక్ ను కారు ఢీకొట్టింది. దీంతో ప్రమాదం జరిగింది.

హరిప్రియ కారులోనే ఇద్దరిని బయ్యారం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం బయ్యారం మండలం మిర్యాలపేట గ్రామ సమీపంలో చోటు చేసుకుంది.  

లాక్ డౌన్ అమలవుతున్న ప్రస్తుత తరుణంలో ప్రజలకు నిత్యావసరాలు పంపిణీ చేయడానికి ఎమ్మెల్యే హరిప్రియ బయలుదేరారు. ఆమెకు భద్రతగా సీఐ, కానిస్టేబుల్ బైక్ పై బయలుదేరారు.