సమ్మక్క, సారలమ్మపై వివాదాస్పద వ్యాఖ్యలపై చిన్న జీయర్ స్వామి శుక్రవారం నాడు వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యల్ని ఎడిట్ చేసి తప్పు బట్టడం హస్యాస్పదమన్నారు.

విజయవాడ: గ్రామ దేవతలను తాను చిన్న చూపు చేసి మాట్లాడినట్టుగా జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని చిన్నజీయర్ స్వామి ప్రకటించారు.

శుక్రవారం నాడు విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. Sammakka, Saralamma దేవతలు కాదని జీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలు ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఈ విషయమై Chinna jeeyar swamy వివరణ ఇచ్చారు. తాను 20 ఏళ్ల క్రితం మాట్లాడిన మాటల పూర్వపరాలు తీసుకోకుండా మధ్యలో తమకు నచ్చినట్టుగా ఎడిటింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మధ్య కొన్ని వివాదాలు తలెత్తాయన్నారు. ఈ మధ్య వచ్చిన ఆరోపణలు ఎలా వచ్చాయో వారి వివేకానికే వదిలేస్తున్నానని జీయర్ స్వామి చెప్పారు. కొందరిని చిన్నచూపు చూసే అలవాటు తమకు లేదని జీయర్ స్వామి తెలిపారు. ఒకళ్లని లేదా కొంతమంది దేవతల్ని చిన్న చూపు చూడడం అనేది పొరపాటు అన్నారు.

ఎవరి పద్దతిలో వారుండాలి. మన పద్దతిలో మనం నడవాలని తాము నమ్ముతామన్నారు. ఒక్క మాట విన్నప్పుడు దాని పూర్వపరాలు పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. స్వంత లాభాలకు ఈ వివాదాన్ని వాడుకోనే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని కూడా జీయర్ స్వామి కోరారు. గ్రామ దేవతలను తాను తూలనాడినట్టుగా ప్రచారం సాగిందన్నారు.అసలు తాత్పర్యం తెలుసుకోకుండా ఆరోపణలు చేస్తే వారిపై జాలిపడాల్సి వస్తుందన్నారు జీయర్ స్వామి.ఆదీవాసీల కోసం తాము అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. అలాంటి తాము వారి పట్ల చిన్నచూపుతో మాట్లాడుతామా అని ఆయన ప్రశ్నించారు. ఆదీవాసీ, Women అగ్రస్థానం ఉండాలని కోరుకొనే వాళ్లలో తాముంటామని జీయర్ స్వామి వివరించారు.

వన దేవతలకు జ్జానం వల్ల వారికి ఆరాద్య స్థానం వచ్చిందని జీయర్ స్వామి చెప్పారు. మనుషుల్ని నుండి వచ్చిన వారే వారి గుణాల నుండి ఉన్నతులుగా మారారన్నారు.అసాంఘికమైన వాటిని అలాంటి దేవతలను పెట్టుకొని ప్రోత్సహించడం మంచిదా అని తాను ఆ రోజున ప్రశ్నించానని జీయర్ స్వామి వివరణ ఇచ్చారు.20 ఏళ్ల క్రితం తాను మాట్లాడిన మాటలను గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారన్నారు. ఇప్పుడు ఈ విషయమై మాట్లాడుతున్నవారికి కళ్లు లేవని చెప్పారు.

దేనికైనా కొన్ని నియమాలుంటాయని జీయర్ స్వామి చెప్పారు.ఒక పద్దతిలో వెళ్లాలనుకొనే వారికి కొన్ని పద్దతులు నియమాలుంటాయని ఆయన చెప్పారు. 
సంప్రదాయ దీక్ష చేసేవారికి మాంసాహరం తగదని తాను చెప్పానని జీయర్ స్వామి వివరణ ఇచ్చారు.

హైద్రాబాద్ లో ఇటీవల సమతామూర్తి కార్యక్రమం నిర్వహించామన్నారు.ఈ కార్యక్రమం గురించి దేశం మొత్తం మాట్లాడుకుటుందన్నారు. అయితే ఇది సహించలేని వారు ఈ వివాదానికి కారణమై ఉంటారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.పబ్లిసిటీ కోరుకొని టీవీల ద్వారా అమాయకులను ప్రజలను రెచ్చగొట్టడం సరైంది కాదని జీయర్ స్వామి అభిప్రాయపడ్డారు. ఇలా రెచ్చగొట్టడం చాలా సులభమన్నారు.

కానీ ఇది సమాజానికి మంచిది కాదని జీయర్ స్వామి చెప్పారు. సమాజ హితం గురించి ఆలోచించే వారంతా కూర్చొని ఆలోచించాలని ఆయన సూచించారు. నాస్తికత్వం కూడా సమాజహితానికి కారణం కావొచ్చన్నారు.సమతామూర్తి విగ్రహం సందర్శన కోసం ప్రవేశం కోసం రూ. 150 టికెట్ పెట్టామన్నారు. అయితే ఇక్కడ ప్రసాదాలు కూడా ఉచితంగానే ఇస్తున్నామని జీయర్ స్వామి చెప్పారు.