Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ విద్యుత్‌ శాఖపై ‘‘డ్రాగన్ ’’ గురి: హ్యాకింగ్‌కు యత్నం.. కేంద్రం హెచ్చరిక

ముంబై గ్రిడ్‌నే కాదు.. తెలంగాణ విద్యుత్ శాఖపై పంజా విసిరేందుకు చైనా హ్యాకర్లు ప్రయత్నించారు. ఈ విషయమై తెలంగాణ విద్యుత్ శాఖను కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్సాన్స్ టీమ్ హెచ్చరించింది.

china hackers targets telangana electricity department ksp
Author
Hyderabad, First Published Mar 2, 2021, 8:20 PM IST

ముంబై గ్రిడ్‌నే కాదు.. తెలంగాణ విద్యుత్ శాఖపై పంజా విసిరేందుకు చైనా హ్యాకర్లు ప్రయత్నించారు. ఈ విషయమై తెలంగాణ విద్యుత్ శాఖను కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్సాన్స్ టీమ్ హెచ్చరించింది.

చైనాకు చెందిన కొందరు హ్యాకర్లు.. తెలంగాణ స్టేట్ లోడ్, డిస్పాచ్‌మెంట్, ట్రాన్స్‌కో సర్వర్లను చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లుగా తెలిపింది. అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుని బ్లాకింగ్ సర్వర్స్, కంట్రోల్ ఫంక్షన్స్ గమనిస్తూ వుండాలని సీఈఆర్టీ సూచించింది.

దీంతో విద్యుత్ శాఖ అప్రమత్తమైంది. వెబ్‌సైట్‌లో వున్న అందరి యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ మార్చేసింది. దీనిపై స్పందించిన రాష్ట్ర ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌ రావు హ్యాకర్ల విషయంలో అప్రమత్తంగా ఉన్నట్లు తెలిపారు. 

చైనా హ్యాకర్లపై కేంద్రం అప్రమత్తం చేసింద‌న్నారు. రాష్ట్ర సర్వర్లపై హ్యాకింగ్‌కు పాల్పడి విద్యుత్‌ వ్యవస్థను ప్రభావితం చేసే ప్రయత్నం జరిగినట్లుగా తెలిపిందన్నారు. కొన్ని సబ్‌స్టేషన్లలో థ్రెట్‌ యాక్టర్‌ ప్రవేశించినట్లుగా సీఎండీ పేర్కొన్నారు.

కేంద్ర సమాచారంతో సాంకేతిక విభాగం అప్రమత్తమైంద‌ని.. గ్రిడ్‌ అధికారులు, నిపుణులతో సమావేశం నిర్వహించి ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు ప్రభాకర్ రావు తెలిపారు. వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు

 

లడఖ్ ఘర్షణల సమయంలో భారత్‌లో వున్న విద్యుత్ గ్రిడ్‌లపై హ్యాకర్లు టార్గెట్‌గా పెట్టుకున్నారు. ముంబై గ్రిడ్‌ను వైఫల్యం చెందేలా చేశారు. దాదాపు పదిన్నర నుంచి 11 గంటల పాటు ముంబై అంతా విద్యుత్ లేక అంధకారంలోకి వెళ్లిపోయింది. ఇప్పుడు తెలంగాణ విద్యుత్ శాఖపై హ్యాకర్లు గురిపెట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios