Asianet News TeluguAsianet News Telugu

రైతుకు ఆవును బహూకరించిన చిలుకూరు బాలాజీ ఆలయం.. (వీడియో)

విద్యుదాఘాతం లేదా మరేదైనా ప్రమాదంతో పశువులను కోల్పోయిన రైతుల దుస్థితితో కదిలిన చిల్కూర్ ఆలయ ప్రధాన పూజారి సి ఎస్ రంగరాజన్ గోసేవ, సామాజిక స్పృహతో ఉండే పవన్ కుమార్ సహాయంతో గత రెండు సంవత్సరాలుగా రాష్ట్రవ్యాప్తంగా అనేక మంది రైతులకు సహాయం చేశారు.

Chilkur Balaji Temple gifts cow to farmer - bsb
Author
Hyderabad, First Published Jul 20, 2021, 9:58 AM IST

పెద్ద మంగళారాం గ్రామానికి చెందిన రైతు అంజయ్యకు చిలుకూరు బాలాజీ ఆలయం గోశాల నుండి ఒక ఆవును అందజేశారు. కరెంట్ షాక్ తో అతని రెండు రెండు గేదెలు చనిపోవడంతో అతనికి ఒక ఆవును బహుమతిగా ఇచ్చామని ఆలయ పూజారి  సిఎస్ రంగరాజన్ తెలిపారు. 

"

పిడుగు పాటుకి, విద్యుదాఘాతం వంటి ప్రమాదాలలో పశువులను కోల్పోవడం వల్ల బాధపడుతున్న రైతులకు సహాయం చేయడానికి, సమాజాన్ని చైతన్య పరుస్తూ ఎన్నో కార్యక్రమాలు చిలుకూరు బాలాజీ దేవాలయం చేస్తోందని ఈ సందర్భంగా రంగరాజన్ తెలిపారు. 

విద్యుదాఘాతం లేదా మరేదైనా ప్రమాదంతో పశువులను కోల్పోయిన రైతుల దుస్థితితో కదిలిన చిల్కూర్ ఆలయ ప్రధాన పూజారి సి ఎస్ రంగరాజన్ గోసేవ, సామాజిక స్పృహతో ఉండే పవన్ కుమార్ సహాయంతో గత రెండు సంవత్సరాలుగా రాష్ట్రవ్యాప్తంగా అనేక మంది రైతులకు సహాయం చేశారు.

అంతకుముందు సిద్దిపేటకు చెందిన ఒక రైతు తన పశువులను విద్యుదాఘాతంతో కోల్పోయినప్పుడు అతనికి ఒక ఆవును ఇచ్చారు. పొరుగు గ్రామాలకు చెందిన కొద్ది మంది రైతులకు ఎద్దులను కూడా ఇచ్చారు. 

రైతు తన ఆవును, ఎద్దు లేదా గేదెను తన కుటుంబ సభ్యుడిగా భావిస్తాడు, పశువుల మరణం వారిని ఆర్థిక సమస్యల్లోకి నెట్టివేస్తుంది. "అనేక మంది రైతుల కుటుంబాలు ఒక కుటుంబ సభ్యుడిని కోల్పోయినట్లుగా పశువుల మృతదేహాలపై ఏడవడం మేము చూశాం, వారికి ఈ సహాయం చేయమని రంగరాజన్ స్వామిని అభ్యర్థించాను" అని సామాజిక సేవా కార్యక్రమాల్లో పూజారి రంగరాజన్ కి సహాయం చేసే పవన్ కుమార్ చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios