హైదరాబాద్: హైద్రాబాద్ నగర శివారులోని మల్లాపూర్‌లో కుటుంబ తగాదాలతో  భార్యతో పాటు చిన్నారిని మూడో అంతస్తు నుండి కిందకు తోశాడు. ఈ ఘటనలో  చిన్నారి అక్కడికక్కడే మృతి చెందగా, భార్య మాత్రం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

మంగళవారం రాత్రి భార్యతో భర్త యోగేష్  గొడవపడ్డారు. ఈ క్రమంలోనే భార్యను మూడో అంతస్తు నుండి  కిందకు నెట్టాడు. ఈ క్రమంలో కిందపడిన చిన్నారి సంఘటన స్థలంలోనే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన భార్యను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతోంది. 

స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని యోగేష్‌ను  అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.