Asianet News TeluguAsianet News Telugu

ముక్కముట్టని జనం.... పడిపోయిన చికెన్ ధరలు, ఆఫర్లే.. ఆఫర్లు

మాంసం విక్రయాలు దారుణంగా పడిపోవడంతో చికెన్ రేట్లు దారుణంగా పడిపోయాయి. కార్తీకమాసంతో పాటు వివిధ రకాల దీక్షల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక వాతావరణం చోటు చేసుకుంది.  

Chicken Prices Decrease With Effect Of Karthika Masam
Author
Hyderabad, First Published Nov 20, 2018, 1:14 PM IST

మాంసం విక్రయాలు దారుణంగా పడిపోవడంతో చికెన్ రేట్లు దారుణంగా పడిపోయాయి. కార్తీకమాసంతో పాటు వివిధ రకాల దీక్షల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక వాతావరణం చోటు చేసుకుంది.  ప్రతి ఏటా కార్తీకమాసంలో మటన్, చికెన్‌తో పాటు బిర్యానీ వంటి మాంసాహారాలు అమ్మకాలు తగ్గుముఖం పడతాయి..

పూజలు, నోముల కారణంగా చాలా మంది మాంసాహారానికి దూరంగా ఉంటారు. దీనికి తోడు ఈ సారి కార్తీకమాసంతో పాటు విష జ్వరాలు విజృంభించడంతో మాంసాహారం తగ్గించారని వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నెల 8 నుంచి కార్తీకమాసం ప్రారంభమైంది..

ప్రారంభం నుంచే మాంసాహారం విక్రయాలపై ప్రభావం పడింది.  ప్రతినిత్యం 70 నుంచి 100 కేజీల వరకు చికెన్ విక్రయాలు జరిగేవి.. ఆదివారం రోజైతే అంతకు రెట్టింపు వ్యాపారం ఉండేది. కార్తీకం ప్రభావం హోటళ్లు, రెస్టారెంట్ల బిజినెస్‌ పడిపోయింది. దీంతో నాన్ వెజ్ ప్రియుళ్లను ఆకర్షించేందుకు ఆఫర్లు ప్రకటించేందుకు వ్యాపారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios