తెలంగాణలో మహాకూటమి తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు సిద్ధమయ్యారు.  ఆయన ఎన్నికల ప్రచార షెడ్యూల్ ని తెలంగాణ టీడీపీ నేత ఎల్. రమణ విడుదల చేశారు.

వారు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. ఈనెల 28వ తేదీన మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో చంద్రబాబు విమానంలో అమరావతి నుంచి బయలుదేరతారు. 2గంటలకు ఖమ్మం జిల్లా చేరుకుంటారు. అక్కడ గొల్లగూడెంలో ఏర్పాటు చేసిన సభలో కాసేపు పాల్గొంటారు.

అనంతరం 2గంటల 15 నిమిషాలకు అక్కడి నుంచి కారులో బయలుదేరి 2గంటల 30 నిమిషాల కల్లా ఖమ్మం ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి చేరుకుంటారు. అక్కడ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తో  కలిసి పబ్లిక్ మీటింగ్ లో పాల్గొంటారు.  సాయంత్రం 4గంటలకు అక్కడి నుంచి కారులో బయలు దేరి అక్కడి నుంచి మళ్లీ గొల్లగూడెం చేరుకుంటారు.

అక్కడ నుంచి విమానంలో బేగంపేట ఎయిర్ పోర్టుకి చేరుకుంటారు. అక్కడి నుంచి సాయంత్రం 5గంటల 30 నిమిషాలకు అమీర్ పేటలోని సత్యం థియేటర్ సమీపంలో ఏర్పాటు చేసిన పబ్లిక్ మీటింగ్ హాజరౌతారు.ఈ మీటింగ్ లో రాహుల్ గాంధీ కూడా పాల్గొంటారు. అక్కడి నుంచి 6గంటల 30 నిమిషాలకు బయలు దేరి.. 6గంటల 45 నిమిషాలకు నాంపల్లిలోని ఆసిఫ్ నగర్ కి చేరుకుంటారు. ఇక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలలో చంద్రబాబు, రాహుల్ గాంధీ పాల్గొంటారు.