Asianet News TeluguAsianet News Telugu

జగన్ కుట్రలను తెలంగాణలో తిప్పికొట్టండి: చంద్రబాబు

గురువారం హైదరాబాదులోని నిజాంపేట రోడ్‌షోలో చంద్రబాబు ప్రసంగించారు. గోదావరి నీళ్లు తాను తీసుకుపోతానని, ఇక్కడ అభివృద్దికి అడ్డంపడతానని టీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారని, తెలంగాణలో కల్వకుర్తి, బీమా మొదలుకుని అన్ని ప్రాజెక్టులు అనాడు తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంజూరు చేసినవేనని ఆయన అన్నారు. 

Chandrababu comments on YS Jagan
Author
Hyderabad, First Published Nov 29, 2018, 9:45 PM IST

హైదరాబాద్: తెలంగాణలో టీఆర్ఎస్‌ను గెలిపించాలని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పిలుపునిచ్చాడని, కోడి కత్తి పార్టీ కుట్రలను ప్రజలు తిప్పి కొట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు హైదరాబాద్‌లో పెద్ద సంఖ్యలో కాపులున్నారని వారి కోసం కార్పోరేషన్ ఏర్పాటు చేసి ఆదుకునే బాధ్యత ప్రజకూటమి తీసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు. 

గురువారం హైదరాబాదులోని నిజాంపేట రోడ్‌షోలో చంద్రబాబు ప్రసంగించారు. గోదావరి నీళ్లు తాను తీసుకుపోతానని, ఇక్కడ అభివృద్దికి అడ్డంపడతానని టీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారని, తెలంగాణలో కల్వకుర్తి, బీమా మొదలుకుని అన్ని ప్రాజెక్టులు అనాడు తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంజూరు చేసినవేనని ఆయన అన్నారు. 

అరికెపూడి గాంధీ అసలు సిసలైన నకిలీ గాంధీ అని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీకి మోసం చేసినవారిని చిత్తు చిత్తుగా ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు.  ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకే 37 ఏళ్లు పోరాడిన కాంగ్రెస్‌తో టీడీపీ జతకట్టిందన్నారు. పెద్ద మోదీ, చిన్నమోదీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆయన అన్నారు. 

హైదరాబాద్‌ను తాను నిర్మించలేదని, సైబరాబాద్‌ సిటీకి తానే రూపకల్పన చేశానని ఆయన తెలిపారు. హైదరాబాద్‌ అభివృద్ధిలో అడుగడుగునా తన కృషి ఉందని ఆయన చెప్పారు. ఆధునిక తెలంగాణ సృష్టికర్తను తానేనని, పెత్తనం చెలాయించడానికి  తాను ఇక్కడకు రాలేదని చంద్రబాబు అన్నారు. తాను రిమోట్‌ కంట్రోల్‌ చేస్తానని తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. 13 సీట్లతో తానెలా పెత్తనం చేయగలనని ప్రశ్నించారు. 

తనకు రిమోట్‌ కంట్రోల్‌ తెలియదని, డైరెక్ట్‌గానే వస్తానని చంద్రబాబు అన్నారు. తెలుగువారు ఎక్కడ ఉంటే అక్కడ టీడీపీ ఉంటుందన్నారు. తెలంగాణలో ప్రజాకూటమి అధికారంలోకి రాబోతోందని, కాంగ్రెస్‌ అభ్యర్థి సీఎం అవుతారని, తమ పార్టీ మద్దతిస్తుందని ఆయన అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios