హైదరాబాద్ నగర శివార్లలో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. రామచంద్రాపురం పోలీసు స్టేషన్ పరిధిలో ఓ కాస్టేబుల్‌పై చైన్ స్నాచర్ కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో గాయపడిన కానిస్టేబుల్ పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా వైద్యులు తెలిపారు.
హైదరాబాద్ నగర శివార్లలో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. రామచంద్రాపురం పోలీసు స్టేషన్ పరిధిలో ఓ కాస్టేబుల్‌పై చైన్ స్నాచర్ కత్తితో దాడి చేశాడు. వివరాలు.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో చైన్ స్నాచర్లు హల్ చల్ చేశారు. రెండు రోజుల్లో నాలుగు చైన్ స్నాచింగ్‌లకు పాల్పడ్డారు. దీంతో పోలీసులు చైన్ స్నాచర్‌ను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చేపట్టారు. అయితే మంగళవారం బీరంగూడలో ఓ మహిళ మెడలో నుంచి చైన్ స్నాచర్.. బంగారు గొలుసును దొంగిలించేందుకు యత్నించాడు.
అయితే అక్కడే విధుల్లో ఉన్న ఎస్‌వోటీ ఎస్‌వోటీ కానిస్టేబుల్ యాదయ్య.. ఇది గమనించి చైన్ స్నాచర్‌ను పట్టుకునేందుకు యత్నించాడు. ఈ క్రమంలోనే యాదయ్యపై కత్తితో దాడి చేసిన చైన్ స్నాచర్ అక్కడి నుంచి నుంచి పరారయ్యడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన యాదయ్యను.. బీరంగూడ కమాన్ దగ్గరున్న ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించి చికిత్స చేశారు. ఆ తర్వాత గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం యాదయ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా వైద్యులు తెలిపారు. యాదయ్యను సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర పరామర్శించారు. మరోవైపు చైన్ స్నాచర్లను పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా గాలింపు చేపట్టారు.
