హైదరాబాద్: తెలంగాణ ముందస్తు ఎన్నికలలో ఈవీఎంలు, వీవీ ప్యాట్ లలో ఎలాంటి ఇబ్బందులు లేవని సిఈవో రజత్  కుమార్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్ ప్రారంభమైందని ఆయన తెలిపారు. అయితే రాజకీయ పార్టీలు పరస్పర దాడులపై ఫిర్యాదులు అందినట్లు రజత్ కుమార్ తెలిపారు. 

ఈ అంశంపై అన్ని జిల్లాల అధికారులను వివరణ కోరామని ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పోలింగ్ ఏర్పాట్లపై రజత్ కుమార్ సంతృప్తి వ్యక్తం చేశారు.