హైదరాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంశాఖ మంత్రి హైదరాబాద్ లో పర్యటిస్తున్నారు. శనివారం మధ్యాహ్నాం హైదరాబాద్ చేరుకున్న అమిత్ షాకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, మురళీధర్ రావులతోపాటు ఎంపీలు ఎమ్మెల్యే బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. 

అనంతరం అక్కడ నుంచి నేరుగా రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం మామిడిపల్లి సమీపంలోని రంగనాయకుల తండా చేరుకున్నారు. రంగనాయకుల తండాలో సోనీనాయక్ అనే గిరిజన మహిళ ఇంటికి చేరుకున్నారు.  సోనీ నాయక్ ఇంట్లో అమిత్ షా లంచ్ చేశారు. 

అమిత్ షా తోపాటు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి, మురళీధర్ రావు, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ లు భోజనం చేశారు. అనంతరం సోనీనాయక్ కు బీజేపీ సభ్యత్వం ఇచ్చి సభ్యత్వ నయమోదు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. 

అనంతరం అక్కడ నుంచి కేఎల్ సీసీ కన్వెన్షన్ సెంటర్ కు చేరుకున్నారు అమిత్ షా. కేఎల్‌సీసీ కన్వెన్షన్‌ సెంటర్‌ లో పార్టీ సభ్యత్వ నమోదును లాంఛనంగా ప్రారంభిస్తారు. అనంతరం సాయంత్రం 6.30 గంటలకు నోవాటెల్‌ హోటల్‌లో పార్టీ ముఖ్య నాయకులతో జరిగే విందు సమావేశానికి హాజరవుతారు. రాత్రి 9 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో సీఐఎస్ఎఫ్ ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. అక్కడ నుంచి నేరుగా ఢిల్లీ వెళ్లనున్నారు అమిత్ షా.