హైదరాబాద్‌లో పట్టపగలు దుండగులు రెచ్చిపోయారు. కూకట్‌పల్లిలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు తెగబడ్డారు. స్థానిక హెచ్‌డీఎఫ్‌సీ ఏటీఎంలో డబ్బులు జమ చేస్తున్న సమయంలో సెక్యూరిటీ గార్డులపై దుండగులు కాల్పులు జరిపి పెద్ద మొత్తంలో నగదు ఎత్తుకెళ్లారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలిస్తున్నారు. ఈ ఘటనలో సెక్యూరిటీ సిబ్బందికి పొట్ట భాగంలో బుల్లెట్ దూసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. గాయపడిన వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

కాల్పులు జరిపిన నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. రద్దీగా వుండే ప్రాంతంలో ఒక్కసారిగా కాల్పుల శబ్ధాలు వినిపించేసరికి జనం భయాందోళనలకు గురయ్యారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.